ఆ సర్వేతో వైసీపీ నేతలను భయపెడుతున్న జగన్ ?

ఇప్పటి వరకు తమ రాజకీయ ప్రత్యర్థులను మాత్రమే భయపెడుతూ వస్తున్న ఏపీ సీఎం జగన్ ఇప్పుడు సొంత పార్టీ నేతలకు కూడా అదే స్థాయిలో భయపెడుతూ కంగారు పుట్టిస్తున్నారు.

తన ప్రభుత్వంలో ఏక్కడా అవినీతి అనేది ఉండకూడదన్న ఉద్దేశంతో పనిచేస్తున్నజగన్.ఈ విషయంలో ఇప్పటికే సొంత పార్టీ నాయకులను కట్టడి చేసిన ఆయన ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలలో టిక్కెట్లు ఇచ్చే విషయంలోనూ అదే రూట్ లో వెళ్తున్నట్టుగా కనిపిస్తున్నారు.

ఈ మేరకు ఇప్పటికే నాయకులకు దీనికి సంబంధించిన సమాచారం కూడా అందడంతో వారు గగ్గోలు పెడుతున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను తయారు చేసుకున్న నాయకులు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత ఆయా అభ్యర్థుల పేర్లు ప్రకటించాలని ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

"""/"/వారి ఆశలపై నీళ్లు జల్లుతూ వైసీపీ నుంచి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలో, గెలిచే అభ్యర్థులు ఎవరు అనేది స్వయంగా పార్టీ నిర్ణయిస్తుందని ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని ఏపీ సీఎం జగన్ పార్టీ శ్రేణులకు తెలియజేశారు.

ఈ విషయంలో పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులు ఎవరు అనేది తమ దగ్గర పక్కా సమాచారం ఉందని, అభ్యర్థుల ఎంపిక క్షేత్రస్థాయిలో ఎవరి బలం ఏమిటి అనేది స్పష్టంగా సర్వే ద్వారా తెలుసుకున్నామని ప్రకటించడంతో నాయకుల గుండెల్లో రాయిపడినట్టయ్యింది.

ఇప్పటికే తమకు అనుకూలమైన వారిని అభ్యర్థులుగా ఎంపిక చేసేందుకు సిద్ధమవుతున్న వారికి జగన్ ప్రకటన ఆందోళన కలిగిస్తోంది.

"""/"/స్వయంగా అధినేతే ఈ విధంగా ప్రకటన చేయడంతో తమ బాధ ఎవరికి చెప్పుకున్నా ప్రయోజనం ఉండదు అనే భావనలో వారంతా ఉన్నారు.

ఇక జగన్ విషయానికి వస్తే తెలంగాణాలో కేసీఆర్ ఇదే రకంగా ముందుకు వెళ్లి తిరుగులేని ఫలితాలు సాధించడంతో తాను కూడా అదే రూట్లో వెళ్లాలని జగన్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది.

ప్రస్తుతం సర్వే ఏ విధంగా జరిగింది ? ఎప్పుడు జరిగింది ? ఎలా జరిగింది అనే విషయాలపైనే నాయకులు ఆరాతీస్తున్నారు.

తమను నమ్ముకుని ఉన్న అనుచరగణానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో సీటు దక్కుతుందా లేదా అనే టెన్షన్ ఎమ్యెల్యేలు, ఇంచార్జీల్లోనూ నెలకొంది.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?