జగన్ మాట : ఏపీకి మూడు రాజధానులు ?

ఏపీ రాజధాని విషయంలో చాలా కాలంగా రచ్చ రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.

దీనిపై శాసనసభలో వాడి వేడి చర్చ కూడా నడిచింది.దీనిపై శ్రీకాకుళం శాసనసభ సభ్యుడు ధర్మాన ప్రసాదరావు టీడీపీ మీద అసెంబ్లీ లో అనేక ప్రశ్నలు సంధించారు.

మీ అసమర్ధత కారణంగానే ఏపీకి ఇప్పటికీ సరైన రాజధాని లేకుండా పోయింది అంటూ విమర్శిచారు.

దీనికి బాబు కూడా అదే స్థాయిలో రిప్లై ఇచ్చారు.ఇక ఈ విషయంలో ఏపీ సీఎం జగన్ కూడా స్పందించారు.

ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు వచ్చే అవకాశం కూడా ఉందంటూ జగన్ చెప్పుకొచ్చారు.తమ ప్రభుత్వం మూడు రాజధానులు నిర్మించే ఆలోచనలో ఉందని, పరిపాలన అంతా ఒకే ప్రాంతానికి పరిమితం కాకుండా చుస్తున్నామంటూ జగన్ తన మనసులో మాట బయటపెట్టారు.

మూడు రాజధానులు నిర్మిస్తే జుడీషియల్ ఒకదగ్గర ఉంటాయి.అమరావతిలో చట్టసభలు.

విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ రావచ్చు.కర్నూలులో హైకోర్టు పెట్టొచ్చు.

వారం రోజుల్లో నిపుణుల కమిటీ నివేదికు ప్రభుత్వానికి సమర్పిస్తుంది.త్వరలో రాజధానిపై నిర్ణయం తీసుకుంటామంటూ జగన్ చెప్పుకొచ్చారు.

దీనిబట్టి చూస్తే ఒక ప్రాంతానికే అభివృద్ధిని పరిమితం చేయడం ద్వారా ఆ తరువాత మిగతా ప్రాంతాల వారు తమ ప్రాంతాన్నివిస్మరించారు అనే అపవాదు తమ మీద పడకుండా జగన్ జాగ్రత్తపడుతున్నట్టుగా అర్ధం అవుతోంది.

గుహలో నిజంగానే 188 ఏళ్ల వ్యక్తిని రక్షించారా.? నిజమెంత?