ఆ ఇద్దరు టీ మంత్రులకు అసెంబ్లీలోనే స్పీకర్ చురకలు… ఒక్కసారిగా షాక్
TeluguStop.com
తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ ఇద్దరు మంత్రులకు చురకలు అంటించేశారు.సాక్షాత్తు స్పీకరే మంత్రులకు చురకలు వేయడంతో సభలో ఉన్న తోటి ఎమ్మెల్యేలు అంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు.
ఇంతకు తెలంగాణ స్పీకర్ ఆ ఇద్దరు మంత్రులకు ఎందుకు ? చురకలు వేశారు ? కారణం ఏంటన్నది పరిశీలిస్తే కాస్త ఆసక్తికరమే అనిపిస్తుంది.
ప్రస్తుతం తెలంగాణలో కరోనా ఎంతలా స్వైరవిహారం చేస్తుందో ? ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.అసలే తెలంగాణలో కరోనా కట్టడిలో అధికార టీఆర్ఎస్ ఘోరంగా విఫలమైందన్న విమర్శలు విపక్షాల నుంచి వస్తున్నాయి.
కరోనా టెస్టులు కూడా ఎక్కువుగా చేయడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.ప్రభుత్వం కూడా కరోనా విషయంలో ముందున్నంత జాగ్రత్తలు తీసుకోవడం లేదని కూడా పలువురు అంటున్నారు.
ఇలాంటి టైంలో బాధ్యతకల ప్రజాప్రతినిధులు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ అందరికి ఆదర్శంగా ఉండాలి.
అయితే అసెంబ్లీ సాక్షిగా ఇద్దరు మంత్రులు కోవిడ్ రూల్స్ ఉల్లంఘించారు.సభలో మంత్రులు ఈటల రాజేందర్, జగదీశ్‌రెడ్డి కోవిడ్ రూల్స్ పాటించకుండా పక్కపక్కనే కూర్చున్నారు.
సభ జరుగుతూ ఉండగానే ఈటల పక్కనే ఉన్న నో సిటీంగ్ కుర్చీలో మరో మంత్రి జగదీశ్ రెడ్డి కూర్చున్నారు.
వీరిద్దరు అన్ని మర్చిపోయి గుసగుసల్లో మునిగిపోయారు.దీనిని గమనించిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మంత్రి గారు నో-సీటింగ్ సీట్‌లో కూర్చోవద్దని సూచించడంతో పాటు కోవిడ్ రూల్స్ పాటించాలన్నారు.
దీంతో వెంటనే జగదీశ్ రెడ్డి ఈటల పక్కనుంచి వెళ్లిపోయారు.ఆ వెంటనే స్పీకర్ పోచారం సభలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు కోవిడ్ రూల్స్ పాటించాలని విజ్ఞప్తి చేశారు.
ఇక కొద్ది రోజుల ముందే డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ సైతం కరోనా భారీన పడిన సంగతి తెలిసిందే.
ఓ సభలో మంత్రి కేటీఆర్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు.అప్పుడు ఆయనకు మాస్క్ లేదు.
కేటీఆర్ మాస్క్ పెట్టేందుకు ప్రయత్నించినా పద్మారావు తిరస్కరించారు.ఈ సంఘటన జరిగిన రెండు రోజులకే ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చింది.
ఆ వెంటనే కేటీఆర్ కూడా దీనిపై స్పందిస్తూ తాను మాస్క్ పెట్టేందుకు ప్రయత్నించినా పద్మారావు తిరస్కరించారని.
మాస్క్ పెట్టుకుని ఉంటే ఆయనకు కరోనా వచ్చేదే కాదన్నారు.
న్యూజెర్సీ : మరోసారి ఎడిషన్ మేయర్ రేసులో సామ్ జోషి .. ప్రవాస భారతీయుల మద్ధతు