సినిమాలో పుష్ప రాజ్ పక్కన ఉన్న ఈ నటుడు ఎవరో తెలుసా?

సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో తాజాగా తెరకెక్కిన చిత్రం పుష్ప.ఈ సినిమా తాజాగా విడుదలైన విషయం తెలిసిందే.

ఈ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ ను అందుకుని ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

ఇందులో అల్లు అర్జున్ పుష్ప రాజ్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే.ఇకపోతే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పక్కనే ఉన్న ఒక నటుడు అందర్నీ అకట్టుకున్నాడు.

సినిమాల్లోని చాలా సన్నివేశాల్లో అతడు కనిపించాడు.దీంతో ప్రేక్షకులు అతడు  ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు ?అని సర్చ్ చేయగా.

అతనికి సంబంధించిన విషయాలు బయటకు వచ్చాయి.అతని పేరు జగదీష్ ప్రతాప్ బండారి.

సినిమాలో అల్లు అర్జున్ తర్వాత అంత పెద్ద క్యారెక్టర్ చేసింది ఇతనే.సినిమాలోని అన్ని సన్నివేశాల్లో అల్లు అర్జున్ కనిపించిన ప్రతి సారి కూడా జగదీష్ కనిపిస్తాడు.

రంగస్థలం సినిమాలో చెర్రీ పక్కన జబర్దస్త్ కమెడియన్ మహేష్ ఏవిధంగా అయితే ఉన్నాడో , ఇప్పుడు బన్నీ పక్కన జగదీష్ కూడా అలాగే నటించారు.

రాయలసీమ యాసలో మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకున్నారు జగదీష్.ఇంతకుముందు జగదీష్ ఏ సినిమాలో కనిపించలేదు.

కానీ ఒక్కసారిగా పుష్ప సినిమాలో కనిపించి అది కూడా అంత పెద్ద క్యారెక్టర్ ను అతనికి ఇచ్చేసరికి అతని గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు.

"""/" / పుష్ప సినిమాలో జగదీష్ అత్యంత కీలకమైన పాత్రలో అద్భుతంగా నటించాడు.

అయితే పుష్ప సినిమా కంటే జగదీష్ పలు సినిమాల్లో నటించినప్పటికీ అవి డిజాస్టర్ గా నిలిచాయి.

1978లో పలాస సినిమాలో ఒక పాత్రలో నటించాడు జగదీష్.అంతకుముందు ప్రియదర్శి మల్లేశం అనే సినిమాలో కూడా నటించాడు.

అయితే జగదీష్ నటించిన సినిమాలు అన్నీ కూడా చిన్న చిన్నవి కావడంతో అతనికి తగిన గుర్తింపు దక్కలేదు.

ఇక పుష్ప సినిమా లో సరైన క్యారెక్టర్ చేసి ఒక్కసారిగా పాపులర్ అయిపోయాడు జగదీష్.

మరి ఈ సినిమా తర్వాత జగదీష్ కు ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడాలి మరి.

మోక్షజ్ఞ ఎంట్రీ వల్ల అక్కినేని హీరోల మీద ప్రెజర్ పెరగనుందా..?