Isha Sahani : ఈమె ఎవరో గుర్తుపట్టారా? ఒకప్పుడు హీరో రామ్ హీరోయిన్.. ఇప్పుడు ఏం చేస్తుందంటే?
TeluguStop.com
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కొత్త కొత్త హీరోలు హీరోయిన్లు ఇస్తూనే ఉంటారు.మరి కొంతమంది హీరోయిన్లు ఒకటి రెండు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత అవకాశాలు లేక సినిమా ఇండస్ట్రీకి దూరం అవుతూ ఉంటారు.
అలా సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లు సినిమా ఇండస్ట్రీకి దూరమైన విషయం తెలిసిందే.
అటువంటి వారిలో ఇషా సహానీ కూడా ఒకరు.టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని( Ram Potheneni ) హీరోగా నటించిన జగడం సినిమా మనకు గుర్తుండే ఉంటుంది.
ఆ సినిమాలో ఇషా సహానీ( Isha Sahani ) రామ్ పోతినేని సరసన నటించిన విషయం తెలిసిందే.
"""/" /
ఈ సినిమాతో భారీగా పాపులారిటీని సంపాదించుకుంది ఇషా సహానీ.ఈ సినిమాలో తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది.
మరి ముఖ్యంగా యూత్లో మంచి క్రేజ్ ని ఏర్పరచుకుంది.ఈ సినిమా తర్వాత తమిళంలో బ్యాడ్ బాయ్( Bad Boy ) సినిమాలో నటించింది.
ఆ తర్వాత సరైన అవకాశాలు లేకపోవడంతో ఈ ముద్దుగుమ్మ నెమ్మదిగా సినిమా ఇంట్రెస్ట్ కి దూరమైంది.
కాగా ఇషా సహానీ స్వాతహాగా డాన్సర్ అన్న విషయం తెలిసిందే.అప్పట్లో ఈమె చాలా లైవ్ షో లో డాన్స్ వేసి ప్రేక్షకులను మెప్పించింది.
ఆ తర్వాత ఒక వ్యాపారవేత్త ని పెళ్లి చేసుకొని లండన్ లో సెటిల్ అయిపోయింది.
"""/" /
ఆ తర్వాత ఈమె సోషల్ మీడియాలో కూడా యాక్టివా కనిపించడం లేదు.
ఇది ఇలా ఉంటే ఇటీవల ఒక ఈవెంట్ లో ఈ ముద్దుగుమ్మ పాల్గొనడంతో అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
అయితే జగడం( Jagadam ) సినిమా సమయంలో ఉన్న హీరోయిన్ ని ఇప్పుడున్న ఆమెను చూస్తే గుర్తుపట్టడం చాలా కష్టం.
ఇషా సహానీ అంతలా గుర్తుపట్టిన విధంగా మారిపోయింది.అయితే ప్రస్తుతం ఈమె పెళ్లి చేసుకుని కుటుంబ బాధ్యతలను చూసుకుంటూ ఇంటికి పరిమితమైనట్టు తెలుస్తోంది.
అల్లు అర్జున్ బెయిల్ రద్దు ? పోలీసులు ఏం చేయబోతున్నారు ?