చావు అంచుల వరకు వెళ్లిన జబర్దస్త్ వినోద్ కన్నీటి కష్టాలు తెలిస్తే షాకవ్వాల్సిందే!
TeluguStop.com
జబర్దస్త్ షో ద్వారా మంచి కమెడియన్ గా గుర్తింపును సంపాదించుకున్న వాళ్లలో జబర్దస్త్ వినోద్ ఒకరనే సంగతి తెలిసిందే.
ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జబర్దస్త్ వినోద్, అతని భార్య మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.
హెల్త్ సమస్యలు వచ్చి వీక్ అయ్యానని వినోద్ అన్నారు.నేను చాలా తక్కువగా ఫుడ్ తీసుకుంటానని ఆయన కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
ఊపిరితిత్తులో వాటర్ ఫామ్ అవ్వడంతో ఇబ్బంది పడ్డానని వినోద్ అన్నారు.ఈ సమస్య వచ్చిన సమయంలో నడవడం కూడా కష్టమైందని ఆయన వెల్లడించారు.
నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఇచ్చిందని వినోద్ తెలిపారు.ఎక్స్ రే ద్వారా ఈ సమస్యను గుర్తించడం జరిగిందని ఆయన వెల్లడించారు.
ఎక్కువగా ప్రయాణాలు చేయడం వల్ల, జంక్ ఫుడ్ తినడం వల్ల, కూల్ డ్రింక్స్ తాగడం వల్ల ఈ సమస్య వచ్చిందని వినోద్ పేర్కొన్నారు.
వినోద్ భార్య మాట్లాడుతూ వినోద్ కు లంగ్స్ లో ఇన్ఫెక్షన్ అని తెలిసి బాధ పడ్డానని ఆయన వెల్లడించారు.
నాకు ఈ ఆరోగ్య సమస్య వచ్చిందని తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు అన్ని విధాలుగా సహాయసహకారాలు అందించడంతో త్వరగా కోలుకున్నానని ఆయన తెలిపారు.
మెడిసిన్స్ వల్ల హెయిర్ లాస్ అయిందని వినోద్ అన్నారు.చావు అంచుల వరకు వెళ్లిన వినోద్ ఆ సమస్య నుంచి కోలుకుంటున్నారు.
"""/"/
ఇకపై మరింత ఎక్కువగా ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించాలని భావిస్తున్నారని వినోద్ తెలిపారు.
జబర్దస్త్ లో ఫుడ్ గురించి వినోద్ మాట్లాడుతూ ఎవరి అభిప్రాయాలు వాళ్లకు ఉంటాయని వినోద్ చెప్పుకొచ్చారు.
వినోద్ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.వినోద్ మళ్లీ జబర్దస్త్ షోతో బిజీ కావాలని ఆయన ఫ్యాన్స్ మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లలో ఎవరు బెస్ట్.. ఈ ప్రశ్నకు జవాబిదే!