కరాటే కళ్యాణిపై జబర్దస్త్ శాంతి స్వరూప్ ఫైర్.. ఎందుకంటే?

తెలుగు సినీ నటి, బిగ్ బాస్ ఫేమ్ కరాటే కళ్యాణి గురించి అందరికీ తెలిస్తే.

ఇక ఈమె సినిమాలలో ఎన్నో బోల్డ్ పాత్రలలో నటించింది.ఇక బయట కూడా ఈమె ఎంతో బోల్డ్ గా మాట్లాడుతూ ఉంటుంది.

ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంత కాలం తన మాటలతో బాగా రెచ్చిపోయింది.

తన నోటికి వచ్చినట్లు బాగా ఫైర్ అవుతూ ఉంటుంది.ఇదిలా ఉంటే తాజాగా జబర్దస్త్ శాంతి కూడా కరాటే కళ్యాణి పై బాగా ఫైర్ అయ్యింది.

జబర్దస్త్ లో లేడీ గెటప్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ శాంతి స్వరూప్.

హైపర్ ఆది టీమ్ లో పని చేస్తాడు శాంతి స్వరూప్.ఇదిలా ఉంటే ఇటీవలే హైపర్ ఆది శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో తెలంగాణ బతుకమ్మ పాటను హేళన చేయడంతో తెలంగాణకు సంబంధించిన కొందరు సభ్యులు తనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

"""/"/ దీంతో హైపర్ ఆది తన సోషల్ మీడియా వేదిక ఓ వీడియో షేర్ చేస్తూ క్షమాపణ కోరాడు.

ఈ నేపథ్యంలో కరాటే కళ్యాణి స్పందిస్తూ.ఆది నువ్వు హైపర్ కావచ్చు.

కానీ అది శృతిమించింది.కాస్త తగ్గి క్షమాపణలు చెప్పాలని నేను కోరుతున్నాను.

నువ్వు ఒక సంస్కృతిని అవమానిస్తే గుంజి అంటూ వార్నింగ్ ఇచ్చేలా ఓ పోస్టు పెట్టింది.

"""/"/ ఇక శాంతి స్వరూప్ ఈ పోస్ట్ ని స్క్రీన్ షాట్ తీసి అభిమానులకు షేర్ చేస్తూ.

ఆమె ఈ పోస్టు పెట్టడం హాస్యాస్పదంగా ఉంది అంటూ పైగా తనకు ఒక సామెత గుర్తుకు వచ్చిందని తెలిపాడు.

ముం.మోపి ఆడది ముత్తయిదువుకి సలహా ఇచ్చినట్లు ఉంది.

నువ్వు కూడా హైపర్ ఆది టీం లో నటించావు.మర్చిపోయావా అంటూ కళ్యాణి పై పోస్ట్ చేశాడు.

ఇక ఈ పోస్టు కాసేపట్లోనే వైరల్ కాగా మళ్లీ వెంటనే ఆ పోస్టును డిలీట్ చేశాడు శాంతి స్వరూప్.

కేరళ బుడ్డోడు అల్టిమేట్ డిమాండ్.. బిర్యానీ కోసం మొండికేస్తే, ప్రభుత్వం దిగొచ్చింది!