లావుగా ఉంటే పెళ్లి చేసుకోవద్దా? లావుగా ఉంటే పెళ్లి కాదా?.. జబర్దస్త్ రోహిణి కామెంట్స్ వైరల్!
TeluguStop.com
రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు జబర్దస్త్ లేడీ కమెడియన్, నటి రోహిణి( Actress Rohini ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
తెలుగులో ఎన్నో సినిమాలలో, సీరియల్స్ లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుంది రోహిణి.
నటిగా మంచి పాపులారిటీని ఏర్పరుచుకున్న రోహిణి బిగ్ బాస్ హౌస్( Bigg Boss House
) లోకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీని సంపాదించుకుంది.
కేవలం బుల్లితెరపై మాత్రమే కాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించి మెప్పించింది.
ఆ సంగతి పక్కన పెడితే. """/" /
తాజాగా రోహిణి ఒక జర్నలిస్ట్ పై మండి పడింది.
తాను ఒక సినిమా ప్రమోషన్స్ కోసం ఒక ఫ్రాంక్ వీడియో చేసిన సంగతి తెలిసిందే.
రేవ్ పార్టీలో పట్టుబడినట్టుగా రోహిణి చేసిన ఈ వీడియో సినిమా ప్రమోషన్ గురించి అందరికీ అర్థమైంది.
కానీ ఒక జర్నలిస్ట్ ఒక యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో ఇష్టమొచ్చినట్టుగా వాగేశాడట.సదరు వ్యక్తికి స్వీట్ వార్నింగ్ ఇస్తూ రోహిణి ఒక వీడియోని విడుదల చేసింది.
చెప్పు తీసుకుని కొట్టేదాన్ని అంటూ తీవ్రస్థాయిలో రోహిణి మండి పడింది.నా సర్జరీ గురించి మాట్లాడాడు.
"""/" /
లావుగా ఉందని, పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని అన్నాడు అంటూ ఆమె మండి పడింది.
లావుగా ఉంటే పెళ్లి చేసుకోవద్దా? లావుగా ఉంటే పెళ్లి కాదా? అసలు మీరేం జర్నలిస్ట్ సీనియర్ అని, పెద్దవారు అని, సీనియర్ జర్నలిస్ట్ అన్న ఒకే కారణంతో వదిలేస్తున్నానని, అదే వేరే వాళ్లు అయి ఉంటే చెప్పు తీసుకొని కొట్టే దాన్ని అంటూ తీవ్ర స్థాయిలో మండి పడుతూ రోహిణి ఆగ్రహం వ్యక్తం చేసింది.
మాట్లాడే ముందు కాస్త ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడమని వార్నింగ్ ఇచ్చింది.ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ రోహిణికి మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.