తమ్ముడి కూతురి బర్త్ డే గ్రాండ్ గా సెలబ్రేట్ చేసిన జబర్దస్త్ రాకేష్.. వైరల్ ఫొటోస్?
TeluguStop.com
తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో గురించి మనందరికీ తెలిసిందే.
జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో కమెడియన్ రాకేష్ కూడా ఒకరు.
జబర్దస్త్ తో పాటు పండుగ ఈవెంట్లు అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా తనదైన శైలిలో కామెడీ చేస్తూ ప్రేక్షకులు నవ్వించు వస్తున్నాడు రాకింగ్ రాకేష్.
ఇకపోతే కమెడియన్ గా రాకింగ్ రాకేష్ బాగా పాపులారిటీ తెచ్చుకున్న విషయం తెలిసిందే.
ఆ తర్వాత సర్దార్ సుజాతతో కలిసి ప్రేమయనం నడిపి మరింత పాపులర్ అయ్యాడు.
అయితే వీరిద్దరూ ఒకరికి ఒకరు స్టేజిపై ప్రేమ ప్రపోజ్ చేసుకోవడంతో అది కేవలం ఆన్ స్క్రీన్ మాత్రమే అనుకున్నారు.
కానీ ఆఫ్ స్క్రీన్ లో కూడా వీరిద్దరూ కలిసి కనిపిస్తుండడంతో వీరిది నిజమైన లవ్వా లేకపోతే ఓన్లీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం కోసమేనా అన్నది అర్థం కావడం లేదు.
ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వారిద్దరిపై ట్రోలింగ్స్ సైతం మొదలు పెట్టేసారు నెటిజన్స్.
ఇది ఇలా ఉంటే తాజాగా రాకేష్ ఇంట్లో బర్త్డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి.
రాకేష్ తమ్ముడు కూతురు బర్త్డే సెలబ్రేషన్స్ రాకేష్ ఇంట్లో గ్రాండ్ గా జరగడంతో ఈ వేడుకకు పలువురు జబర్దస్త్ కమెడియన్లు కూడా హాజరయ్యారు.
"""/"/
ఈ క్రమంలోనే ఈ వేడుకకు జోర్దార్ సుజాత, శివ బాలాజీ, ధనరాజ్ లాంటి సెలబ్రిటీలు పాల్గొన్నారు.
కాగా ఎందుకు సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ అవ్వడంతో ఆ ఫోటోలో రాకేష్ కుటుంబంతో కలిసి సుజాత కనిపించడంతో నెటిజన్స్ మళ్లీ ట్రోలింగ్స్ మొదలు పెట్టేశారు.
అంతేకాకుండా ఈ మధ్యకాలంలో రాకేష్ సుజాతతో కలిసి డాన్స్ పెర్ఫార్మన్స్ కూడా చేయడం మొదలుపెట్టాడు.
శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో భాగంగా పలుసార్లు ఇప్పటికే వీరిద్దరూ కలిసి స్పెషల్ ఫార్మా పర్ఫామెన్స్ లు చేసిన విషయం తెలిసిందే.
అయితే వారిద్దరి రిలేషన్ విషయంలో క్లారిటీ ఇవ్వకపోవడం పట్ల నెటిజెన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆ షాట్స్ ను డైరెక్ట్ గా కాపీ కొడతాను.. వైరల్ అవుతున్న జక్కన్న సంచలన వ్యాఖ్యలు!