అందరి ముందు ఆమె కాళ్లు పట్టుకున్న జబర్దస్త్ నూకరాజు.. ఏం జరిగిందంటే?

జబర్దస్త్ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులర్ అయిన కమెడియన్లలో నూకరాజు ఒకరు.

ఈ షో వల్ల ఇతర ఛానెళ్లలో కూడా నూకరాజుకు సినీ ఆఫర్లు వస్తున్నాయి.

తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో రిలీజ్ కాగా ఆసియా ఈ షోలో ఎమోషనల్ అయ్యారు.

నూకరాజు ఆమె కన్నీళ్లు తుడవటంతో పాటు ఆమె సంతోషపడేలా చేశారు.నూకరాజు ఆసియాతో నేను నీకు ఏం చేశానో ఏం చేయలేదో చెప్పలేను కానీ అంటూ అందరిముందు ఆమె కాళ్లు పట్టుకున్నారు.

అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం నూకరాజు ఆసియా త్వరలో పెళ్లి చేసుకోనున్నారు.ఒక జబర్దస్త్ కమెడియన్ తన యూట్యూబ్ ఛానల్ లోని వీడియో ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.

నూకరాజు ఆసియా మతాంతర వీవాహం చేసుకోనున్నారని తెలుస్తోంది.వీళ్లిద్దరి పెళ్లికి కుటుంబ సభ్యుల నుంచి ఆమోదం లభించిందో లేదో తెలియాల్సి ఉంది.

నూకరాజు ఆసియాలకు పటాస్ షో సమయంలో పరిచయం ఏర్పడిందని ఆ పరిచయం ప్రేమగా మారిందని సమాచారం.

మరోవైపు శ్రీదేవి డ్రామా కంపెనీ మంచి రేటింగ్ ను సొంతం చేసుకుంటోంది.సుధీర్ ఈ షోకు హోస్ట్ గా దూరం కావడంతో రష్మీ ఈ షోకు హోస్ట్ గా కొనసాగుతున్నారు.

సుధీర్ లేకపోవడంతో ఈ షో చూడలేకపోతున్నామని చాలామంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.సుధీర్ ఈటీవీ ఛానల్ లోకి రీఎంట్రీ ఇవ్వడం కష్టమేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఈటీవీ ఛానల్ లో సుధీర్ కు పొమ్మనలేక పొగబెట్టారని అందుకే ఆయన ఈ షోకు దూరమయ్యారని సమాచారం.

"""/" / సుధీర్ కు బుల్లితెరపై రోజురోజుకు క్రేజ్ పెరుగుతోంది.ఇతర కమెడియన్లతో పోల్చి చూస్తే సుధీర్ కు ఆఫర్లు ఎక్కువగా రావడంతో పాటు రెమ్యునరేషన్ కూడా పెరుగుతోంది.

సుధీర్ స్టార్ మా ఛానల్ లో సూపర్ సింగర్ జూనియర్స్ ప్రోగ్రామ్ ను అనసూయతో కలిసి హోస్ట్ చేస్తుండగా ఈ షో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది.