జబర్దస్త్ కొత్త యాంకర్ సౌమ్యా రావు రెమ్యునరేషన్ ఎంతో మీకు తెలుసా?
TeluguStop.com
జబర్దస్త్ షోకు కొత్త యాంకర్ సౌమ్యా రావు ఎంట్రీ ఇవ్వడంతో సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో ఆమె గురించి జోరుగా చర్చ జరుగుతోంది.
సౌమ్యా రావు గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు సైతం ఆసక్తి చూపిస్తున్నారు.సౌమ్యా రావుకు ఇప్పటికే పెళ్లైందని తెలిసి కొంతమంది ఆశ్చర్యానికి గురవుతున్నారు.
అయితే జబర్దస్త్ షోకు ఆమెకు భారీ స్థాయిలోనే రెమ్యునరేషన్ దక్కుతోందని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.
ఈటీవీలో ప్రసారమయ్యే శ్రీమంతుడు సీరియల్ ద్వారా పాపులర్ అయిన సౌమ్యా రావుకు ఇతర భాషల్లో సైతం మంచి గుర్తింపు ఉంది.
ప్రస్తుతం సౌమ్య ఎపిసోడ్ కు 80,000 రూపాయల చొప్పున రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని బోగట్టా.
సౌమ్య వల్ల జబర్దస్త్ షో రేటింగ్ పెరిగితే ఆమె రెమ్యునరేషన్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
అనసూయ, రష్మీలను మించి సౌమ్య మెప్పించడం గ్యారంటీ అని కొంతమంది కామెంట్లు చేస్తుండటం గమనార్హం.
జబర్దస్త్ షో ఎంతోమందికి ఊహించని స్థాయిలో పాపులారిటీని తెచ్చిపెట్టింది.సౌమ్యా రావుకు కూడా ఈ షో ద్వారా ఊహించని రేంజ్ లో పాపులారిటీ దక్కే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
సౌమ్యా రావు టాలెంటెడ్ యాంకర్ అని మరి కొందరు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జబర్దస్త్ షో వల్ల సౌమ్యకు సినిమా రంగంలో ఆఫర్లు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
"""/"/
ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ లో ఒకటైన ఈటీవీ ఛానల్ ప్రతిభ ఉన్నవాళ్లకు ఎక్కువగా అవకాశాలను ఇస్తూ ప్రోత్సహిస్తుండటం గమనార్హం.
సౌమ్య టాలెంట్ తో ఇతర ఛానెళ్ల నుంచి కూడా ఆఫర్లను అందుకుంటారేమో చూడాలి.
సోషల్ మీడియాలో కూడా సౌమ్యా రావుకు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.సౌమ్యా రావు కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుండటం గమనార్హం.
కాశ్మీరీ పండిట్ల వలసకు 35 ఏళ్లు .. యూకే పార్లమెంట్‌లో తీర్మానం