'రూమ్'కు వస్తావా ఛాన్స్ ఇస్తాను.. ఆ 'కమెడియన్'తో అసభ్య ప్రవర్తన?
TeluguStop.com
ఈటీవీ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ షో గురించి అందరికీ తెలిసిందే.ఈ షో నుండి ఎంతోమంది కమెడియన్లు వెండితెర లో కూడా అడుగు పెడుతున్నారు.
ఇదిలా ఉంటే అందులో వేసే లేడీ గెటప్ లు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి.
చూడటానికి అచ్చం అమ్మాయిల ఉంటూ, అంతే అందంగా కనిపిస్తుంటారు.ఇదిలా ఉంటే తాజాగా కమెడియన్ కు కొందరు నుండి అసభ్య ప్రవర్తనాలు ఎదురయ్యాయట.
ఇంతకీ ఆ కమెడియన్ ఎవరంటే.జబర్దస్త్ ప్రేక్షకులకు హరిత గా పరిచయమైన లేడీ గెటప్ వేసుకున్న హరి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.ఇక ఆయన జీవితం లో ఎదురైనా సంఘటనలను పంచుకున్నాడు.
అతడు భాస్కర్ సహా అందరి స్కిట్ లతో లేడీ గెటప్ వేస్తుంటాడు.లేడీ గెటప్ ఆయన ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నాడు.
ఆర్టిస్ట్ గా ఒక్క రూపాయి సంపాదించాలి అంటే చాలా కష్ట పడాల్సి వస్తుందని అంటున్నాడు.
బయట నుంచి కొందరు పని పాట లేని వెధవలు మాత్రం తమల్ని కామెంట్స్ చేస్తుంటారని, జబర్దస్త్ కు రాకముందు ఆయన తన ఊరిలో ఒక సెలబ్రెటీ అని తెలిపాడు.
అంతే కాకుండా లేడీ గెటప్స్ లో ఎన్నో స్కిట్ లు కూడా చేశాడట.
ఇక అక్కడ గుర్తింపు పొంది జబర్దస్త్ లో అవకాశాన్ని అందుకున్నారట.ఇక ఆయనకు లేడీ గెటప్స్ వల్ల చాలా ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపాడు.
"""/"/
తన పెద్ద అక్క హిజ్రా తో పోల్చింది అని ఏడ్చాడు కూడా.
ఇదే కాకుండా బయట కూడా కొన్ని వేధింపులు ఎదురయ్యాయని ఏకంగా కొందరు తనకు ఐ లవ్ యు కూడా చెప్పారని దానికి ఎలా స్పందించాలో కూడా అర్థం కాలేదు అని తెలిపాడు.
ఎందుకంటే ఆయన కూడా అబ్బాయి కదా, అలాంటిది అబ్బాయిలే వచ్చి ప్రేమిస్తున్నానని అన్నప్పుడు తనకు నవ్వు వస్తుందని తెలిపాడు.
వాళ్ల దృష్టిలో ప్రేమ అనేది నిజమైనది కాదని, అదంతా లోబర్చుకోవడం కోసమని అన్నాడు.
ఇక జబర్దస్త్ లో వచ్చిన కొత్తలో టీమ్ లీడర్స్ ను అవకాశలకోసం అడిగితే.
కొందరు రూమ్ కు పిలిచారంటూ చెప్పుకొచ్చాడు.కానీ వాళ్ల పేర్లు చెప్పనని ఇదేమీ కొత్త కాదు అంటూ ఇదివరకే ఎంతోమంది జబర్దస్త్ లేడీ గెటప్ వాళ్లకి ఇటువంటివి ఎదురయ్యేవని తెలిపాడు.
బాలయ్య డాకు మహారాజ్ సినిమాతో భారీ సక్సెస్ కొట్టడా..?