రోజాకు వార్నింగ్ ఇచ్చిన జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్.. వేలు చూపిస్తూ?

ఈ మధ్య కాలంలో టీవీ ఛానెళ్లు పండుగ రోజుల్లో స్పెషల్ ఈవెంట్లను ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ ఈవెంట్లకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు భారీస్థాయిలో టీఆర్పీ రేటింగ్స్ కూడా వస్తున్నాయి.

దసరా పండుగ కానుకగా దసరా బుల్లోళ్లు పేరుతో ఈవెంట్ ప్రసారం కానుండగా మాయాబజార్ రీక్రియేటెడ్పేరుతో ప్రసారమైన స్కిట్ లో గెటప్ శ్రీను కృష్ణుడిగా రోజా శశిరేఖగా కనిపించారు.

బుల్లెట్ భాస్కర్ ఘటోత్కచునిగా, హైపర్ ఆది శకునిగా కనిపించి మెప్పించారు.రోజా కృష్ణుని పాత్రలో ఉన్న గెటప్ శ్రీను దగ్గరికి వెళ్లి చిన్నాన్నల వారికి ప్రణామములు అని చెబుతారు.

గెటప్ శ్రీను నిండు మనస్సుతో దీనిని తెరిస్తే నీకు ప్రియమైనవారు ప్రత్యక్షమవుతారని చెప్పగా శేఖర్ మాస్టర్ ప్రత్యక్షమవుతారు.

ఆ తర్వాత ఇమ్మాన్యుయేల్ దగ్గరకు వర్ష వెళ్లి ఏంటి ఆ అమ్మాయి షర్ట్ పట్టుకుంటందంటూ ఇమ్మాన్యుయేల్ చెంపపై కొడుతుంది.

"""/"/ ఆ తర్వాత వర్ష రోజా దగ్గరకు వెళ్లి చూశారా.నేను పక్కనుండగా చూడండి మేడమ్ అమ్మాయిని తీసుకొని వచ్చాడంటూ ఏడుస్తూ చెబుతుంది.

ఆ తర్వాత ఇమ్మాన్యుయేల్ సీరియస్ గా రోజా వైపు చూస్తూ నాకు ఇష్టమైన వాళ్లతో నేను ఉంటాయని అయితే ఏంటి ఇప్పుడు అంటూ రోజాకు సమాధానం చెబుతాడు.

రోజా వెంటనే ఇమ్మాన్యుయేల్ చెంపపై కొట్టగా నేను ప్రేమించాను మేడమ్ ఈ అమ్మాయిని అంటూ ఇమ్మాన్యుయేల్ రోజాకు వార్నింగ్ ఇస్తున్నట్టు గట్టిగా అరుస్తూ చెబుతాడు.

"""/"/ ఇమ్మాన్యుయేల్ వేలు చూపించడంతోl చెయ్యి దించు అంటూ రోజా ఇమ్మాన్యుయేల్ పై సీరియస్ అవుతుంది.

ఆ తర్వాత ఇమ్మాన్యుయేల్ కూల్ అవుతూ నేను జబర్దస్త్ లో చేస్తానని ఒక దేవత  తాను బాగా చేస్తున్నానని చాక్లెట్ బాయ్ అనే పేరు పెట్టిందని మధ్యలో వర్ష వచ్చి 11 గంటలకు ఫోన్ చేశానని చెప్పిందని ఆ తర్వాత కొంతమంది మన లైఫ్ లో లేకపోతే కష్టం మేడమ్ అని వర్ష చెప్పిందని వర్షను ఎగతాళి చేస్తూ ఇమ్మాన్యుయేల్ డైలాగ్స్ చెబుతాడు.

దసరా రోజున ఈటీవీ ఛానల్ లో ఈ ఈవెంట్ ప్రసారం కానుంది.

మైక్ ఇస్తే చాలు.. స్టేజ్ పై చెత్త వాగుడు వాగుతున్న దర్శకులు