పవన్ కు ఓటు వేయడానికి ఖండాలు దాటి వస్తున్న ఫ్యాన్స్.. ఇది కదా అభిమానమంటే?

ఏపీ ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ లోక్ సభ ఎన్నికలు( Assembly Lok Sabha Elections ) జరగనున్నాయి.

ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి.కాగా ఎన్నికలకు సంబంధించి భారత ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసింది.

ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం లాంటి ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రముఖులు, సెలబ్రెటీలు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

కానీ రాజకీయాలపై నేటి యువతకు వున్న దురభిప్రాయం, అనాసక్తి వంటి కారణాలతో చాలా మంది ఓటు వేయడాన్ని కూడా ఇష్టపడటం లేదు.

ప్రభుత్వం ఆ రోజున సెలవు దినంగా ప్రకటిస్తే.కుటుంబంతో గడిపేందుకు , లేదంటే ఏదైనా వెకేషన్‌కు వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు.

"""/" / ఈ నేపథ్యంలో ఓటును తప్పనిసరి చేయాలని మేధావులు డిమాండ్ చేస్తున్నారు.

ఓటు వేయని వారిపై చర్యలు తీసుకునేలా చట్టాలు తీసుకురావాలని కోరుతున్నారు.పక్కనున్న పోలింగ్ కేంద్రానికి వెళ్లేందుకే ఇష్టపడని జనం వుంటే ఓటు వేసేందుకు ఖండాంతరాలు దాటొస్తున్నారని కొందరు కుర్రాళ్లు.

ఈ విషయాన్ని జబర్దస్త్ నటుడు గెటప్ శ్రీను ( Getup Srinu )పంచుకున్నారు.హైదరాబాద్ విమానాశ్రయంలో తనకు స్పూర్తినిచ్చే సంఘటన జరిగిందని చెబుతూ.

ఓటు వేయడానికి విదేశాల నుంచి వస్తున్న కుర్రాళ్లని చూపించారు.పూరుజ్ ( Puruj )అనే యువకుడు కెనడా ( Canada )నుంచి ఓటేయ్యడానికి ఇండియాకు వస్తున్నట్లు తెలిపారు.

ప్రూఫ్‌లు ఏమైనా వున్నాయా అని శ్రీను అడగ్గా.పూరుజ్ ఫ్లైట్ టికెట్లు చూపించారు.

"""/" / ఎడ్మంటన్ టూ అమ్‌స్టార్‌డామ్.అమ్‌స్టార్‌డామ్ టూ ఢిల్లీ( Amsterdam To Delhi ).

ఢిల్లీ టూ హైదరాబాద్ మీదుగా తాను జర్నీ చేసినట్లు గెటప్ శ్రీను తెలిపారు.

మరో యువకుడు తాను అమెరికా నుంచి ఓటు వేసేందుకు వస్తున్నట్లు తెలిపారు.మయామీ టూ లండన్.

లండన్ టూ ఢిల్లీ, ఢిల్లీ టూ హైదరాబాద్ మీదుగా ఇక్కడికి వచ్చినట్లు వెల్లడించారు.

పవన్ కళ్యాణ్ కు ఓటు వేయడానికి ఖండాలు దాటి రావడం గొప్ప విషయంగానే బావించాలి.

వీరిద్దరిని అభినందించిన గెటప్ శ్రీను.ఇండియాలో పొరుగు రాష్ట్రాల్లో వుంటూ ఓటు వేయడానికి రాని వారు వీళ్లని చూసి నేర్చుకోవాలని సూచించారు.

మే 13న ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకుని మన బాధ్యతను నిర్వర్తించాలని గెటప్ శ్రీను తెలిపారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరపున పిఠాపురంలో విస్త్రతంగా ప్రచారం చేస్తున్నారు గెటప్ శ్రీను.

అతని సహచరులు హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, రాంప్రసాద్‌లతో కలిసి ఇంటింటికి తిరుగుతూ పవన్‌కు ఓటేయ్యాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

సిద్దు జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ ల పరిస్థితి ఏంటి..?