పటాస్ ప్రవీణ్ కు అందుకే దూరం.. దేవుడి చేతిలోనే పెళ్లి.. జబర్దస్త్ ఫైమా ఎమోషనల్!
TeluguStop.com
తెలుగు ప్రేక్షకులకు బుల్లితెర జంట ఫైమా, ప్రవీణ్( Faima, Praveen ) ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
వీరిద్దరూ పటాస్ షో( Patas Show ) ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు.
ఆ తర్వాత జబర్దస్త్ షోకి ఎంట్రీ ఇచ్చి విపరీతమైన పాపులారిటీని సంపాదించుకున్నారు.ఇకపోతే ప్రవీణ్ సంగతి పక్కన పెడితే ఫైమా మాత్రం తనదైన శైలిలో కామెడీ చేసి అతి తక్కువ సమయంలోనే లేడీ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు భారీగా అభిమానులను సంపాదించుకుంది.
ఇకపోతే ఫైమా ప్రవీణ్ మధ్య ప్రేమ ఉందని వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని గతంలో ఎన్నో రకాల వార్తలు వినిపించాయి.
"""/" /
కానీ ఫైమా బిగ్ బాస్ షోకు( Bigg Boss Show ) వెళ్లి వచ్చిన తర్వాత నుంచి ప్రవీణ్ తో వీడియోలు చేయకపోవడంతో పాటు కనిపించకుండా ఉండడంతో వీరిద్దరూ విడిపోయారని అందరూ అనుకున్నారు.
ఇదే విషయాన్ని చాలా మంది ఇంటర్వ్యూలు చేస్తూ అడగ్గా.సరైన సమాధానం మాత్రం చెప్పలేదు.
కానీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ఫైమా షాకింగ్ కామెంట్లు చేసింది.
ప్రవీణ్ కు తాను ఎందుకు దూరం అయిందో వివరించింది.అలాగే తమ పెళ్లి ఆ దేవుడి చేతుల్లోనే ఉందంటూ చెప్పుకొచ్చింది.
మేము నిజమైన ప్రేమికులు కాదు అని చెప్పిన ఫైమా ఆ తర్వాత మాత్రం తమ మధ్య బంధం ఉందని చెప్పింది.
అలాగే దాని గురించి సమయం వచ్చినప్పుడు మాత్రమే చెబుతాను ఇప్పుడే ఏమీ మాట్లడ లేను తెలిపింది పైమా.
"""/" /
అయితే ఫైమా మాట్లాడిన మాటలను బట్టి చూస్తే వారి మధ్య ఏదో జరిగిందని అందుకే ఆమె అలా మాట్లాడుతోందని బాగా అర్థం అవుతోంది.
అనంతరం యాంకర్ పెళ్లి ఎప్పుడు అని ప్రశ్నించగా ఇప్పుడు ఏమి చెప్పలేము మా పెళ్లి ఆ దేవుడు చేతిలోనే ఉంది అంటూ క్లారిటీ ఇచ్చింది.
హలో అబ్బాయిలు.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా.. అయితే ఇవి తప్పక తెలుసుకోండి!