పెళ్లి పీటలెక్కబోతున్న జబర్దస్త్ లేడీ కమెడియన్ షబీనా.. వరుడు ఎవరంటే?

జబర్దస్త్ షో ఎంతోమంది కమెడియన్లకు గుర్తింపు రావడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమైంది.ఈ షో ద్వారా పాపులర్ అయిన సెలబ్రిటీలలో షబీనా ఒకరు.

పెళ్లిచూపులు షో ద్వారా బుల్లితెరపై కెరీర్ ను మొదలుపెట్టిన షబీనా బుల్లితెరపై పలు ప్రముఖ సీరియళ్లలో నటించడం ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని పెంచుకున్నారు.

కెవ్వు కార్తీక్ టీంలో చేసిన స్కిట్ల ద్వారా షబీనా మరింత పాపులర్ అయ్యారు.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే షబీనాకు భారీస్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

షబీనా వేసే పంచ్ లు బాగా పేలుతుండటం, వివాదాలకు దూరంగా ఉండటంతో ఆమెకు క్రేజ్ మరింత పెరిగింది.

తాజాగా షబీనాకు నిశ్చితార్థం జరిగింది.షబీనా సోషల్ మీడియా వేదికగా ఫోటోలను షేర్ చేయగా షబీనాకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మున్నా అనే వ్యక్తిని ఆమె పెళ్లి చేసుకోనున్నారని సమాచారం అందుతోంది. """/"/ షబీనా పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటోందని తెలుస్తోంది.

వరుడు మున్నా షబీనా కుటుంబానికి దగ్గరి వ్యక్తి అని బోగట్టా.మున్నా షబీనాల పెళ్లి తేదీకి సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.

షబీనాకు పెళ్లి కుదరడంతో ఆమె అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.షబీనా కలకాలం సంతోషంగా ఉండాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

"""/"/ పెళ్లి తర్వాత కూడా షబీనా టీవీ షోలలో కొనసాగుతారో లేదో క్లారిటీ రావాల్సి ఉంది.

షబీనా చెబితే ఆమె భర్త గురించి, భవిష్యత్తు ప్రణాళికల గురించి మరిన్ని వివరాలు తెలిసే ఛాన్స్ అయితే ఉంటుంది.

షబీనా జబర్దస్త్ షో ద్వారా తన భర్తకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తారేమో చూడాల్సి ఉంది.

షబీనాను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.షబీనా కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

పెళ్లికి దూరంగా ఉన్న టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లు.. వీళ్ల నిర్ణయం వెనుక కారణాలివేనా?