కారు యాక్సిడెంట్ కి గురైన జబర్దస్త్ కమెడీయన్!

జబర్దస్త్ షో( Jabardasth ) గురించి, అందులో నటించిన కమెడియన్స్ గురించి జనాలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఈ షో ద్వారా నేడు తెలుగు చిత్ర పరిశ్రమకు ఎందరో పరిచయం అయ్యారు.

వీరిలో ఆటో రాంప్రసాద్( Auto Ramprasad ) ఒకరు.ఈయన గురించి జనాలకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అయితే ఆటో రాంప్రసాద్ ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్( Car Accident ) అయినట్టు వార్తలు వస్తున్నాయి.

గురువారం (డిసెంర్ 05) ఆటో రాంప్రసాద్ షూటింగ్ కు వెళుతుండగా తుక్కుగూడ( Tukkuguda ) సమీపంలో ఆటో రాంప్రసాద్ ముందున్న కారు సడెన్ బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం జరిగిందని సమాచారం.

అతని కారును వెనక నుంచి ఆటో ఢీ కొట్టడం, ఆ తర్వాత రాంప్రసాద్ కారు ముందు ఉన్న మరో కారుని ఢీ కొట్టినట్లు తెలుస్తోంది.

"""/" / కాగా ఈ ప్రమాదంలో రాంప్రసాద్ కి స్వల్ప గాయాలతో బయటపడినట్టు తెలుస్తోంది.

అయితే ఈ ప్రమాద ఘటన పై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.ఈ క్రమంలో ఆటో రాం ప్రసాద్ త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.

ఇకపోతే జబర్దస్త్ కామెడీ షోతో బాగా ఫేమస్ అయిన కమెడియన్లలో ఆటో రామ్ ప్రసాద్ ఒకరు.

తన ఆటో పంచులతో బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్విస్తున్నాడీ స్టార్ కమెడియన్.

ముఖ్యంగా సుడిగాలి సుధీర్, గెటప్ శీను లతో కలిసి రాం ప్రసాద్.జబర్దస్త్ వేదికపై చేసిన హంగామా గురించి జనాలకి చెప్పాల్సిన పనిలేదు.

"""/" / ఆ తరువాతి కాలంలో సుధీర్, గెటప్ శీను జబర్దస్త్ నుంచి బయటకు వెళ్లిపోయినప్పటికీ రాం ప్రసాద్ తనదైన బెంచ్ మార్క్ కామెడీతో ఇప్పటికీ టీమ్ లీడర్ గా కొనసాగుతుండడం విశేషంగానే చెప్పుకోవచ్చు.

మరోవైపు శ్రీదేవీ డ్రామా కంపెనీతో( Sridevi Drama Company ) పాటు పలు టీవీషోల్లోనూ సందడి చేస్తున్నారు రాం ప్రసాద్.

ఇక వెండితెరపై కూడా అప్పుడప్పుడు మెరుస్తున్నాడీ స్టార్ కమెడియన్.ఆ మధ్యలో సుధీర్, గెటప్ శీనులను హీరోలుగా పెట్టి రాం ప్రసాద్ ఓ సినిమా కూడా తీయనున్నాడని కూడా వార్తలు వచ్చాయి.

ఓ మంచి కామెడీ ఎంటర్ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరిగింది.

అయితే దీనిపైన ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.సదరు సినిమాని నిర్మాతలకు కథ నచ్చితే త్వరలోనే తమ సినిమాను అధికారికంగా పట్టాలెక్కిస్తానని ఆటో రాం ప్రసాద్ కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకురావడం విదితమే.

భారతీయుల అక్రమ రవాణా .. యూకేలో ఇద్దరు వ్యక్తులకు జైలు