అమ్మకు బ్రెయిన్ క్యాన్సర్.. గుర్తుపట్టలేక పోయిందంటూ ఎమోషనల్ అయిన జబర్దస్త్ యాంకర్!

బుల్లితెర నటగా తన కెరీర్ మొదలుపెట్టిన సౌమ్యరావు ( Sowmya Rao ) అనంతరం జబర్దస్త్ ( Jabardasth ) కార్యక్రమానికి యాంకర్ గా ప్రేక్షకులకు పరిచయమయ్యారు.

అయితే ఈ కార్యక్రమానికి యాంకర్ గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.

ఇలా బుల్లితెర కార్యక్రమాలలో నటిస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నటువంటి సౌమ్యరావు నిజజీవితంలో ఎంతో విషాదం ఉందని చెప్పాలి.

ఈమె తన తల్లి క్యాన్సర్ ( Cancer ) బారిన పడి మరణించారంటూ గత మాతృ దినోత్సవం సందర్భంగా తన తల్లికి సంబంధించిన వీడియో ని షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు.

"""/" / క్యాన్సర్ బారిన పడిన తన తల్లి ఎంత నరకాన్ని అనుభవించిందో ఈమె మాతృ దినోత్సవం సందర్భంగా తన తల్లి పడిన కష్టాన్ని అనుభవించిన నరకాన్ని తెలియజేస్తూ షేర్ చేసినటువంటి వీడియో వైరల్ గా మారింది.

అయితే తాజాగా మరోసారి ఈమె తన తల్లి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

తాజాగా ఒక బుల్లితెర కార్యక్రమంలో హైపర్ ఆది( Hyper Aadi) సౌమ్యరావుకు ఆమె తల్లి జ్ఞాపకార్థం ఒక ఫోటో ఫ్రేమ్ కానుకగా ఇచ్చారు.

అది చూసినటువంటి సౌమ్యరావు మరోసారి తన తల్లిని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు.

"""/" / తన తల్లి ఒకరోజు తీవ్రమైన తలనొప్పితో బాధపడుతూ ఉంది ఆ క్షణం డాక్టర్ వద్దకు వెళ్లగా తనకు బ్రెయిన్ క్యాన్సర్ ( Brain Cance R) అని చెప్పారు.

ఇలా బ్రెయిన్ క్యాన్సర్ తో బాధపడుతూ ఉన్న తన తల్లికి చికిత్స అందిస్తూ వచ్చామని దాదాపు మూడున్నర సంవత్సరాల పాటు అమ్మను బెడ్ పై ఉంచి సేవ చేశానని తెలిపారు.

అయితే క్రమక్రమంగా తనకు జ్ఞాపక శక్తి కోల్పోయింది.చివరికి నన్ను కూడా గుర్తించలేని స్థితిలోకి అమ్మ వచ్చింది.

ఆ దేవుడు అమ్మను ఇలాంటి దారుణ పరిస్థితిలో వదిలేస్తారని అనుకోలేదు.అమ్మకు మళ్ళీ జన్మంటూ ఉంటే నా కడుపున పుట్టాలి అంటూ ఈ సందర్భంగా సౌమ్యరావు ఎమోషనల్ అవుతూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

జనసేనకు ఇందనంగా దిల్ రాజు… డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్స్ వైరల్!