జబర్దస్త్ షోకు ఆ యాంకర్ గుడ్ బై చెప్పనున్నారా..?
TeluguStop.com
బుల్లితెర కామెడీ షోలలో ఒకటైన జబర్దస్త్ షో ప్రారంభమై ఎనిమిది సంవత్సరాలైనా ఇప్పటికీ ఈ షోకు మంచి టీఆర్పీ రేటింగ్ లు వస్తున్నాయి.
జబర్దస్త్ షోకు అనసూయ యాంకర్ గా వ్యవహరిస్తుండగా ఎక్స్ట్రా జబర్దస్త్ షోకు రష్మీ యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.
అయితే ఈ ఇద్దరు యాంకర్లలో ఒకరు త్వరలోనే ఆ కామెడీ షోకు గుడ్ బై చెప్పననున్నారని తెలుస్తోంది.
ఒక యాంకర్ గుడ్ బై చెబితే మరో యాంకర్ జబర్దస్త్ తో పాటు ఎక్స్ట్రా జబర్దస్త్ కు యాంకర్ గా వ్యవహరించే అవకాశం ఉంది.
రెమ్యునరేషన్ తక్కువగా ఇవ్వడం వల్లే ఒక యాంకర్ జబర్దస్త్ షోకు దూరమవుతున్నట్టు సమాచారం.
యాంకర్ గా చాలా సంవత్సరాల నుంచి పని చేస్తున్నా కేవలం మూడుసార్లు మాత్రం పారితోషికం పెంచడం.
ఇతర ఛానెళ్ల నుంచి ఎక్కువ మొత్తం పారితోషికంతో ఆఫర్లు వస్తుండటంతో ఒక యాంకర్ జబర్దస్త్ కు దూరం కావాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
రెమ్యునరేషన్ విషయంలో చర్చలు జరిపి యాంకర్ తుది నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం.ప్రస్తుతం తెలుగులో యాంకర్ల కొరత ఎక్కువగా ఉంది.
కొత్త యాంకర్లు వస్తున్నా కొంతమంది యాంకర్లు మాత్రమే అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే విధంగా యాంకరింగ్ చేస్తున్నారు.
ఈ కామెడీ షోలు ఈ స్థాయిలో హిట్ కావడానికి యాంకర్లు కూడా ఒక కారణమని చెప్పవచ్చు.
అయితే జబర్దస్త్ షోను వీడిన వాళ్లలో కొంతమంది సక్సెస్ కాగా మరి కొంతమంది మాత్రం ఇతర ఛానెళ్లలోని ప్రోగ్రామ్ ల ద్వారా సక్సెస్ కాలేకపోయారు.
మరి జబర్దస్త్ ద్వారా గుర్తింపును సంపాదించుకున్న యాంకర్ జబర్దస్త్ షోను వీడితే ఇతర ఛానెళ్లలో కూడా యాంకర్ గా అదేస్థాయిలో గుర్తింపును సంపాదించుకుంటారేమో చూడాల్సి ఉంది.
ఒక యాంకర్ జబర్దస్త్ కు దూరమైతే మాత్రం మరో యాంకర్ కు రెండు షోలకు యాంకర్ గా వ్యవహరించే అదృష్టం దక్కనుంది.
మూడు నెలలు అరటిపండు తిని మజ్జిగ తాగి జీవించానన్న రాజేంద్ర ప్రసాద్.. అన్ని కష్టాలు పడ్డారా?