జబర్దస్త్ కమెడియన్ భార్యను చూసి షాకవుతున్న నెటిజనులు.. ఎందుకంటే?

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో గురించి అందరికీ తెలిసిందే.ఇప్పటికీ ప్రసారం లో ఉన్న ఈ షో కామెడీ షో గా మంచి గుర్తింపు అందుకుంది.

అంతేకాకుండా అందులో పాల్గొనే కమెడియన్స్ కూడా తమదైన శైలితో మంచి కామెడీ ని అందిస్తూ మంచి పేర్లు సంపాదించుకున్నారు.

ఇప్పటికీ పలువురు కమెడియన్స్ వెండితెరపై కూడా మెరిసారు.ఇదిలా ఉంటే తాజాగా మరో కమెడియన్ ఆనంద్ తన ఫ్యామిలీని పరిచయం చేశాడు.

జబర్దస్త్ లో ఆనంద్ తనకంటూ ఓ గుర్తింపు తో మంచి పేరు సంపాదించుకున్నాడు.

ఎన్నో కామెడీ పంచులతో తెగ నవ్విస్తాడు.చమ్మక్ చంద్ర గ్రూప్ లో మొదటగా పని చేయగా ఆ తర్వాత తను కూడా టీం లీడర్ గా ఎదిగాడు.

అంతే కాకుండా తను యూట్యూబ్ ఛానల్ కూడా నడిపిస్తున్నాడు.ఇదిలా ఉంటే ప్రస్తుతం లాక్‌డౌన్‌ సందర్భంగా ఇంట్లో గడుపుతున్న సెలబ్రెటీలు అంతా ఏదో ఒక విషయంతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.

తాజాగా ఆనంద్ 'సరదాగా కాసేపు మా ఫ్యామిలీతో' అనే వేదిక ద్వారా తన భార్య బిడ్డలు ను పరిచయం చేశాడు.

అంతే కాకుండా ప్రేమించి పెళ్లి చేసుకున్నాం అని అందులో ఎన్నో ఎదుర్కొన్నానని పంచుకున్నాడు ఆనంద్.

తనది ఓ సినిమా తీసే అంత పెద్ద స్టోరీ అని అన్నాడు.తన భార్య తనకు ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయ్యిందని.

ఆ తరువాత ఒకరినొకరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నామని తెలిపాడు. """/"/ ఇక ఆ తర్వాత వాళ్ళింట్లో ఒప్పుకోకపోవడంతో తమ పెళ్లి సమయంలో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ రేంజ్ వంటి సీన్లు కూడా ఎదురయ్యాయని తెలిపాడు.

ఇక తాను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత జబర్దస్త్ జడ్జి, సీనియర్ నటి రోజా, చమ్మక్ చంద్ర తనకు సపోర్ట్ చేశాడని తెలిపాడు.

ఇక ఆనంద్ భార్యను చూసిన నెటిజనులు అందంగా ఉందంటూ, మీ ఫ్యామిలీ బాగుంది అంటూ తెగ పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

సొంత ఇంటి కల నెరవేర్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ శోభ.. ఫోటోలు వైరల్!