జబర్దస్త్ లో ఇచ్చిన రెమ్యునరేషన్ ఇదే.. జబర్దస్త్ వినోద్ కామెంట్స్ వైరల్!

జబర్దస్త్ షో వల్ల ఆర్థికంగా స్థిరపడ్డ కమెడియన్ల సంఖ్య తక్కువేం కాదు.ఎంతోమంది కమెడియన్లకు లైఫ్ ఇచ్చిన షోగా జబర్దస్త్ కు పేరుంది.

ఈ షో ద్వారా కమెడియన్లుగా సెటిల్ అయిన వాళ్ల సంఖ్య తక్కువేం కాదు.

అయితే జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన వినోద్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ షో రెమ్యునరేషన్ కు సంబంధించిన విషయాలతో పాటు ఇతర విషయాలను సైతం వెల్లడించారు.

పంచ్ ప్రసాద్ కు ఇప్పటికీ డయాలసిస్ జరుగుతోందని వినోద్ తెలిపారు.నా భార్యకు ఎంత బాధ ఉన్నా ఆ బాధను బయటకు చూపించదని వినోద్ తెలిపారు.

నేను ఇప్పటికే కోలుకున్నానని అయితే ఇంకా కోలుకోవాలని వినోద్ వెల్లడించారు.బయటకు వెళ్లిన సమయంలో అమ్మాయికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో అలాంటి ఇబ్బందులన్నీ నేను ఎదుర్కొన్నానని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం.

నా రెమ్యునరేషన్ సంతృప్తి పడే స్థాయిలోనే ఉందని ఆయన అన్నారు.నేను తీసుకున్న హైయెస్ట్ రెమ్యునరేషన్ బాగానే ఉందని అయితే ఆ మొత్తం చెప్పలేనని వినోద్ పేర్కొన్నారు.

ఈవెంట్లు, షోలతో నేను ఎప్పుడూ బిజీగనే ఉన్నానని ఆయన చెప్పుకొచ్చారు.మరదల్ని పెళ్లి చేసుకున్నానని వినోద్ తెలిపారు.

పాప పేరు నీరజ అని అమ్మవారి పేరు పెట్టుకున్నామని ఆయన పేర్కొన్నారు. """/"/ అమ్మ మాతో పాటు ఉండట్లేదని వినోద్ అన్నారు.

తెలుస్తున్న సమాచారం ప్రకారం వినోద్ కు 30000 రూపాయల నుంచి 40000 రూపాయలుగా ఉన్నట్టు సమాచారం అందుతోంది.

వినోద్ త్వరగా కోలుకుని జబర్దస్త్ తో మళ్లీ బిజీ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

జబర్దస్త్ వినోద్ కు ఇతర కామెడీ షోల నుంచి కూడా ఆఫర్లు వస్తుండగా ఆ ఆఫర్లకు వినోద్ నో చెబుతున్నారని సమాచారం అందుతోంది.

జబర్దస్త్ వినోద్ కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది.

వైరల్ వీడియో: పెళ్లికి వెళ్లిన అతిధిలకు భారీగా డబ్బులతో ఉన్న గిఫ్ట్ కవర్..