మొదటిసారి తన తల్లిని అక్కడికి తీసుకెళ్లిన జబర్దస్త్ రోహిణి.. ఆమె మార్పు చూస్తే షాక్ అవ్వాల్సిందే?

బుల్లితెర నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ రోహిణి బుల్లితెర ప్రేక్షకులకు బాగా పరిచయం అని చెప్పవచ్చు.

ఎందుకంటే రోహిణి మొదట్లో సీరియల్స్ లో నటించింది.అందులో తను నటించిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ తో మాత్రం మంచి క్రేజ్ సంపాదించుకుంది.

ఆ సీరియల్ లో తన పాత్రతో బాగా నవ్వించింది రోహిణి.దీంతో అప్పటి నుంచి రోహిణి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.

ఆ తర్వాత పలు సీరియల్ లలో అవకాశాలు కూడా అందుకుంది.మాటీవీలో శ్రీనివాస కళ్యాణం, ఇన్స్పెక్టర్ కిరణ్ అనే సీరియల్ లో పోలీస్ పాత్రలో నటించింది.

సీరియల్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో రియాలిటీ షో బిగ్ బాస్ లో అవకాశం అందుకొని అందులో కూడా అడుగు పెట్టింది.

కానీ అనుకున్నంత ఫలితం రాకపోగా నాలుగో వారానికి తిరిగి వచ్చేసింది.బిగ్ బాస్ తర్వాత రోహిణి జబర్దస్త్ లో బాగా బిజీగా మారింది.

లేడీ కమెడియన్ గా అడుగుపెట్టి తన కామెడీతో బాగా నవ్విస్తుంది.జబర్దస్త్ లోనే కాకుండా ఇతర షో లలో కూడా బాగా సందడి చేస్తుంది.

వెండితెరపై కూడా పలు సినిమాలలో సైడ్ ఆర్టిస్టుగా అవకాశాలు అందుకుంది.కానీ తనకు బుల్లితెరపై మాత్రమే మంచి క్రేజ్ వచ్చింది.

"""/"/ ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండటంతో ఎప్పటికప్పుడు తన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది.

అలా సోషల్ మీడియాలో కూడా ఫాలోయింగ్ సంపాదించుకుంది.యూట్యూబ్ లో కూడా తనకంటూ ఒక ఛానల్ క్రియేట్ చేసుకుని అందులో బాగా సందడి చేస్తుంది.

చేసే ప్రతి అనిని వీడియో తీస్తూ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తుంది.ఆ ఛానల్ కి ఫాలోవర్స్ కూడా ఎక్కువ మంది ఉన్నారు.

ఇక ఈమధ్య రోహిణి కాస్త అందాన్ని కూడా పెంచింది.ఒకప్పుడు లావుగా కనిపించిన రోహిణి ఇప్పుడు కాస్త బరువు తగ్గించి అందంగా రెడీ అవుతూ అందరి దృష్టిలో పడుతూ ఉంటుంది.

అప్పుడప్పుడు తన వంటలు చేసే వీడియోలని యూట్యూబ్లో షేర్ చేస్తూ ఉంటుంది.ఇంట్లో వాళ్లకు ఏదైనా సర్ప్రైజ్ చేసినా కూడా వీడియో తీసి షేర్ చేస్తుంది.

"""/"/ అప్పుడప్పుడు తన ఫ్రెండ్స్ తో కలిసి చేసే అల్లరి పనుల వీడియోలను కూడా పంచుకుంటుంది.

ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా మరో వీడియో షేర్ చేసుకుంది రోహిణి.

అదేంటంటే ఈసారి తన తల్లిని కూడా పరిచయం చేసింది.తన తల్లిని మొదటిసారి తను పార్లర్ కు తీసుకెళ్లగా అక్కడ వాళ్ళు ఆమెను అందంగా రెడీ చేసి చూపించారు.

దీంతో రోహిణి అదంతా వీడియో తీసి.తన అమ్మ అంత అందంగా కనిపించేసరికి చాలా మురిసిపోయింది.

ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అవ్వగా అందులో తన తల్లి మేకప్ కు ముందు మేకప్ తర్వాత చాలా అందంగా కనిపించినట్లు అనిపించింది.

లాస్ ఏంజెల్స్ అగ్నిప్రమాదం .. బాధితులకు సిక్కు కమ్యూనిటీ ఆపన్నహస్తం