హమ్మయ్య జబర్దస్త్ రోహిణి సర్జరీ సక్సెస్… రాడ్ తొలగించిన వైద్యులు!
TeluguStop.com
పలు బుల్లితెర సీరియల్స్ లో నటించి నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రోహిణి(Rohini) అనంతరం జబర్దస్త్ (Jabardasth) కార్యక్రమంలో కూడా సందడి చేసిన విషయం మనకు తెలిసిందే.
ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం సినిమాలలో కూడా నటిస్తున్నారు.
అలాగే మరోవైపు యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే.
ఇలా నటిగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న రోహిణి గత కొద్ది రోజుల క్రితం తన కాలికి సర్జరీ చేయాల్సి వచ్చింది అంటూ ఒక వీడియోని షేర్ చేసిన విషయం మనకు తెలిసిందే.
"""/" /
ఈ సందర్భంగా ఈమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోని షేర్ చేస్తూ 2016వ సంవత్సరంలో తనకు యాక్సిడెంట్ (Accident) జరిగిందని ఆ సమయంలో కాల్ ఫ్రాక్చర్ కావడంతో డాక్టర్లు తనకు రాడ్ వేసి సర్జరీ చేశారని తెలిపారు.
అయితే ఈ రాడ్ కాలిలో ఉండటం వల్ల తాను కొన్ని డాన్స్ మూమెంట్స్ కూడా చేయలేకపోతున్నానని తెలిపారు.
దీంతో ఆ రాడ్ తీయించుకోవాలని హైదరాబాదులో ఒక హాస్పిటల్లో జాయిన్ కాగా వైద్యులు తనకు సర్జరీ చేయడం కోసం ఎంతో కష్టపడినప్పటికీ ఆ రాడ్ కాలిలో సెట్ అవ్వటం వల్ల రాడ్ తీయడానికి కుదరలేదని డాక్టర్లు చెప్పినట్లు ఒక వీడియోని చేశారు.
"""/" /
ఇలా డాక్టర్లు చేతులెత్తేయడంతో కొంత నిరాశ పడిన రోహిణి అనంతరం ప్రమాదం జరిగిన సమయంలో తనకు సర్జరీ చేసినటువంటి డాక్టర్ ను సంప్రదించారు.
ఈ క్రమంలోనే ఆమె విజయవాడకు వచ్చానంటూ మరొక వీడియోని కూడా షేర్ చేశారు.
అయితే తనకు గతంలో చికిత్స చేసిన వైద్యులు దాదాపు 10 గంటల పాటు కష్టపడి తన కాలిలో ఉన్నటువంటి రాడ్ తొలగించి సర్జరీ చాలా సక్సెస్ ఫుల్ చేశారని,సర్జరీ పూర్తి కావడంతో దాదాపు ఆరువారాల పాటు తనని డాక్టర్లు బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పారని ఈ సందర్భంగా రోహిణి చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.
సంక్రాంతి సినిమాల ట్రైలర్ల రిలీజ్ డేట్లు ఇవే.. ఏ సినిమా ట్రైలర్ ఎప్పుడంటే?