ఆమె లేకపోతే ఐదేళ్ల క్రితమే చనిపోయేవాడిని.. పిల్లల్ని తలచుకుంటే ఏడుపొస్తుందంటూ?

ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ కు( Punch Prasad ) టాలెంట్ ఉన్నా ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదని ఆయన అభిమానులు భావిస్తున్నారు.

వేర్వేరు ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న పంచ్ ప్రసాద్ అ సమస్యల నుంచి కోలుకుని సాధారణ మనిషి కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచ్ ప్రసాద్ మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.

జబర్దస్త్ ఆర్టిస్టులు, నాగబాబు, రోజా చాలా సహాయం చేశారని ఆయన తెలిపారు.కిర్రాక్ ఆర్పీ( Kirrak RP ) నాకు లక్ష రూపాయలు సహాయం చేశాడని పంచ్ ప్రసాద్ కామెంట్లు చేశారు.

నూకరాజు ( Nookaraju ) నాకు బ్రదర్ కన్నా ఎక్కువ అని ఆయన తెలిపారు.

ట్యాబ్లెట్లు వాడటం కంటే సర్జరీ బెస్ట్ అని డాక్టర్లు చెప్పారని పంచ్ ప్రసాద్ భార్య కామెంట్లు చేశారు.

నా భార్య నా పిల్లల కంటే నా గురించి ఎక్కువగా ఆలోచిస్తుందని పంచ్ ప్రసాద్ అన్నారు.

"""/" / నా భార్యను బాధ పెట్టకూడదని నేను భావిస్తానని ఆయన తెలిపారు.

నా భార్య లేకపోతే నేను 5 సంవత్సరాల క్రితమే చనిపోయేవాడినని పంచ్ ప్రసాద్ కామెంట్లు చేశారు.

లెగ్ ఇన్ఫెక్షన్, పారా థైరాయిడ్ ఉందని నాకు బ్లడ్ తక్కువగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు.

ఆపరేషన్ కొంతమందికి సక్సెస్ అవుతుందని మరి కొందరికి సక్సెస్ కాదని నేను భయపడేవాడినని పంచ్ ప్రసాద్ పేర్కొన్నారు.

"""/" / పిల్లల కోసం ఆలోచించి సర్జరీ ఆలస్యం చేశానని ఆయన తెలిపారు.

శరీరం స్ట్రాంగ్ గా ఉన్న సమయంలో సర్జరీ చేయించుకోవాలని డాక్టర్ చెప్పారని పంచ్ ప్రసాద్ అన్నారు.

గతంలో కొంతమంది సహాయం చేస్తామని చెప్పినా నేను నో చెప్పానని ఆయన తెలిపారు.

నా గురించి చాలామంది ఆలోచించారని పంచ్ ప్రసాద్ పేర్కొన్నారు.పిల్లల గురించి ఆలోచిస్తే నాకు ఏడుపొస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఎక్కిళ్ళు ఎందుకు వ‌స్తాయి.. వాటిని ఆప‌డం ఎలా..?