జాను వరల్డ్‌వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు.. టార్గెట్ కష్టమేనట!

తమిళంలో సూపర్ హిట్ మూవీగా నిలిచిన 96 చిత్రానికి తెలుగు రీమేక్‌గా తెరకెక్కుతున్న సినిమా ‘జాను’ అన్ని పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.

యంగ్ హీరో శర్వానంద్, స్టార్ బ్యూటీ సమంత జంటగా నటిస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్లు ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెంచాయి.కాగా తమిళంలో సూపర్ సక్సెస్ అయిన ఈ సినిమాను తెలుగులో కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని చిత్ర యూనిట్ ఆశిస్తుంది.

ఈ సినిమాను 96 చిత్ర దర్శకుడు ప్రేమ్‌కుమార్ డైరెక్ట్ చేస్తుండటంతో కథలో పెద్దగా మార్పులు లేకుండానే రిలీజ్ చేస్తున్నారు చిత్ర యూనిట్.

ఇక ఈ సినిమాను స్టార ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ చాలా మంచి రేటుకు జరిగినట్లు తెలుస్తోంది.

జాను సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.21 కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.

ఈ సినిమా లాభాల బాట పట్టాలంటే రూ.21 కోట్లకు పైగా వసూళ్లు సాధించాలి.

ఇక ఏరియాల వారీగా ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

నైజాం - 5.40 కోట్లు సీడెడ్ - 2.

60 కోట్లు వైజాగ్ - 2.20 కోట్లు ఈస్ట్ - 1.

30 కోట్లు వెస్ట్ - 1.10 కోట్లు కృష్ణా - 1.

30 కోట్లు గుంటూరు - 1.45 కోట్లు నెల్లూరు - 0.

65 కోట్లు మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలు - 16 కోట్లు కర్ణాటక - 0.

6 కోట్లు రెస్టాఫ్ ఇండియా - 0.1 కోట్లు ఓవర్సీస్ - 2.

0 కోట్లు ప్రింట్ అండ్ పబ్లిసిటీ - 2.3కోట్లు టోటల్ వరల్డ్‌వైడ్ - 21 కోట్లు.

డబుల్ ఇస్మార్ట్ పోయింది. ఇక రామ్ కి హిట్టిచ్చే దర్శకుడు ఎవరు..?