జాను : అందరిని బలవంతంగానే ఒప్పించిన దిల్‌రాజు

తమిళంలో సక్సెస్‌ అయిన 96 చిత్రాన్ని తెలుగులో జానుగా దిల్‌రాజు రీమేక్‌ చేశాడు.

ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న జాను చిత్రంపై అందరిలో కూడా ఆసక్తి ఉంది.

పెద్దగా హడావుడి లేకుండా చాలా లో హైప్‌ తో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు దిల్‌రాజు అన్ని ఏర్పాట్లు చేశాడు.

చిన్న సినిమా అయినా కూడా ఎక్కువ థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేసేందుకు సిద్దం అయ్యాడు.

ఇక ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరిని కూడా దిల్‌రాజు బలంతంగా ఒప్పించి మరీ చేయించాడట.

ఈ విషయాన్ని స్వయంగా వారే ప్రీ రిలీజ్‌ వేడుకలో చెప్పడం జరిగింది.సమంత మాట్లాడుతూ దిల్‌రాజు గారు 96 రీమేక్‌ రైట్స్‌ తీసుకున్నారు అనగానే నా మేనేజర్‌ ఆయన ఫోన్‌ చేస్తే లేను అని చెప్పేయ్‌ అన్నాను.

కాని ఆయనపై ఉన్న గౌరవంతో ఆయన మాట కాదనలేక ఈ చిత్రంను చేశాను అంటూ సమంత చెప్పుకొచ్చింది.

ఇక శర్వానంద్‌ కూడా మొదట ఆ క్లాసిక్‌ మూవీని చేయడం అవసరమా అన్నాడట.

దిల్‌రాజు చాలా నమ్మకంగా ఉండి శర్వాను ఒప్పించాడట.ఇక దర్శకుడు ఇతర నటీనటులు కూడా ఈ రీమేక్‌ పై ఎక్కువగా ఆసక్తి చూపించలేదట.

కాని దిల్‌రాజు మాత్రం నమ్మకంతో సినిమా రీమేక్‌ను పూర్తి చేశాడు. ""img Src="https://telugustop!--com/wp-content/uploads/2020/02/Jaanu-Dilraju-Sarvanand-Samantha-దిల్‌రాజు!--jpg"/దిల్‌రాజు నిర్మాణంలో సినిమా అనగానే ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటుంది.

అది జాను అవ్వడం వల్ల ఇంకా అంచనాలు భారీగా ఉన్నాయి.అందరిని బలవంతంగా ఈ చిత్రానికి ఒప్పించిన దిల్‌రాజు ప్రస్తుతం మాత్రం అంతా ఆసక్తిగా ఎదురు చూసేలా చేశాడు.

ఒక క్లాసిక్‌ సినిమాను రీమేక్‌ చేయడం తప్పే.కాని ఇది క్లాసిక్‌ అవ్వడంతో పాటు ఒక అద్బుతమైన సినిమా.

ఖచ్చితంగా అందరు ఆధరించే సినిమా అందుకే రీమేక్‌ చేశానంటూ దిల్‌రాజు చాలా నమ్మకంగా చెబుతున్నాడు.

రేణు దేశాయ్ కు చీర సారే పెట్టి సత్కరించిన తెలంగాణ మంత్రి.. కారణం ఇదేనా?