దుకాణం మూసేసిన జాను.. అడ్డంగా బుక్కయిన బయ్యర్లు

యంగ్ హీరో శర్వానంద్, స్టార్ బ్యూటీ సమంత కలిసి నటించిన రీసెంట్ మూవీ జాను ఇటీవల రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.

తమిళంలో సూపర్ సక్సెస్ అయిన 96 చిత్రానికి రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని చూపించడంతో ఈ సినిమా ఎలాంటి విజయం అందుకుంటుందా అని అందరూ అనుకున్నారు.

కాగా ఈ సినిమా చాలా బోరింగ్‌గా ఉండటంతో తెలుగు జనాలకు ఈ సినిమా ఎక్కలేదు.

దీంతో ఈ సినిమా కమర్షియల్ పరంగా చాలా దారుణమైన ఫలితాన్ని రాబట్టింది.ఈ సినిమా టోటల్ రన్‌లో ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.

8.18 కోట్లు మాత్రమే వసూలు చేసింది.

అయితే ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఈ సినిమాను ఏకంగా రూ.21 కోట్లకు బయ్యర్లు కొనుగోలు చేయడంతో వారు భారీ నష్టాలను చవిచూశారు.

ఈ సినిమాను తమిళంలో తెరకెక్కించిన ప్రేమ్‌కుమార్ తెలుగులోనూ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు.

ఇకఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా టోటల్ రన్‌లో వసూలు చేసిన కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.

నైజాం - 2.83 కోట్లు సీడెడ్ - 0.

88 కోట్లు నెల్లూరు - 0.24 కోట్లు కృష్ణా - 0.

57 కోట్లు గుంటూరు - 0.62 కోట్లు వైజాగ్ - 0.

93 కోట్లు ఈస్ట్ - 0.50 కోట్లు వెస్ట్ - 0.

36 కోట్లు టోటల్ ఏపీ+తెలంగాణ - 6.93 కోట్లు రెస్టాఫ్ ఇండియా - 0.

50 కోట్లు ఓవర్సీస్ - 0.75 కోట్లు టోటల్ వరల్డ్‌వైడ్ - 8.

18 కోట్లు.

విశ్వంభర లో త్రిష రోల్ ఏంటో తెలుసా..?