గదిలో గర్ల్ ఫ్రెండ్ ను బంధించి కాల్చి చంపేసిన స్టార్ సింగర్?

ఇటీవలే న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అందరూ 2022 సంవత్సరానికి ఘన స్వాగతం పలికారు.

ఇక ఆ రోజున సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా గడిపారు.

అయితే ఒకవైపు న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా అందరూ ఎంజాయ్ చేసుకుంటుంటే అమెరికాకు చెందిన ఒక సింగర్ మాత్రం ఒక వ్యక్తిని చంపి తాను కూడా షూట్ చేసుకొని మరి ఆత్మహత్య చేసుకున్నాడు.

అమెరికన్ పాప్ సింగర్ ర్యాపర్ జే స్టాష్ చేసిన పని వల్ల ఒక్కసారిగా న్యూ ఇయర్ వేడుకలలో విషాదం నెలకొంది.

అంతేకాకుండా ఆ ఘటన ఏకంగా ముగ్గురు పిల్లల్ని అనాధలను చేసింది.ఫ్లోరిడా రాష్ట్రానికి చెందిన అమెరికన్ సింగర్ స్టాష్ తన ప్రియురాలిని కొత్త సంవత్సరం రోజు దారుణంగా కాల్చి చంపేస్తాడు.

అతడు తన ప్రియురాలిని మాస్టర్ బెడ్ రూం లోకి తీసుకెళ్లి డోర్ లాక్ చేసి పలుమార్లు కాల్పులు జరిపాడు.

అనంతరం అతను కూడా గన్నుతో కాల్చుకొని అక్కడికక్కడే మృతి చెందాడు.చనిపోయిన అతడి ప్రియురాలికి ముగ్గురు పిల్లలు.

అయితే ఇందులో అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే చనిపోయిన ఆ మహిళ ముగ్గురు పిల్లలు కూడా 11 ఏళ్ళు లోపు ఉన్న వారే.

ఆ పిల్లలు కాల్పులు జరిగిన సమయంలో అదే ఇంట్లో ఉన్నారు అని న్యూయార్క్ పోలీసులు తెలిపారు.

"""/" / అయితే గన్ను శబ్దం వినపడడం తో ఆ పిల్లలు బెడ్రూం తలుపులు ఎంత బాదిన కూడా తెరుచుకోకపోవడంతో, వెంటనే ఆ పిల్లలు తమ అమ్మమ్మకి ఆ తర్వాత, పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారట.

సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్టాష్  బెడ్ రూమ్ బద్దలు కొట్టి చూడగా అతడు అతని ప్రియురాలు ఇద్దరూ మరణించారు.

ఇకపోతే తన ర్యాప్ ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న స్టాష్.గర్ల్ ఫ్రెండ్ ని చంపి తాను ఆత్మహత్య చేసుకోవడం వెనుక కారణాలు ఏంటి అనేది ఇంకా తెలియడం లేదు.

అయితే ఈ సంఘటనకు ముందు వారిద్దరూ గొడవపడినట్లు పోలీసులు తెలుపుతున్నారు.

ఎస్ఎస్ఎంబి 29 సెట్స్ ఎప్పుడు వెళ్తుందో క్లారిటీ ఇచ్చిన రాజమౌళి…