వైరల్: పనికి రాని వాటితో డాలర్ల సంపాదన..!

ప్రపంచంలో ప్రతి వస్తువు ఏదోక రకంగా పనికొస్తూనే ఉంటుంది.ఏ వస్తువు కూడా పనికి రాకుండా ఉండదు.

అయితే ఇక్కడొక వ్యక్తి పనికిరాని వస్తువులను కూడా పనికొచ్చేలా చేస్తున్నాడు.సాధారణంగా ప్రజలు తాము చాలా రోజులు వాడిన తర్వాత చెప్పులు, బూట్లను పారేస్తూ ఉంటారు.

ఈ వస్తువులతోనే ఐవరీ కోస్ట్‌కు చెందిన అరిస్టైడ్ కౌమే అనే వ్యక్తి కోట్లను సంపాదిస్తున్నాడు.

ఆయన చెప్పులతో తయారు చేసిన ఆ వస్తువుల విలువ 1,000 డాలర్లు పలుకుతోంది.

భారతదేశం ప్రకారంగా చూస్తే ఆయన రూ.75 కోట్లు సంపాదిస్తున్నాడు.

ఆ వ్యక్తి చేసేటటువంటి కళాత్మక వస్తువులను ఐవరీ కోస్ట్ కళా సంస్థ గుర్తించింది.

సమాజంలో పాడైపోయిన వస్తువులతో విభిన్నంగా ఆలోచించి ఆ వస్తువులను విలువైన ఆర్ట్స్ గా తయారు చేస్తున్న ఆ వ్యక్తి ఇప్పుడు సోషల్ మీడియాలో స్టార్ అయిపోయాడు.

26 సంవత్సరాల కౌమే బీచుల్లో తిరుగుతూ పాడైపోయిన వస్తువులను సేకరిస్తున్నాడు.బీచుల్లో పడేసిన చెప్పులను బూట్లను తీసుకురావడాన్ని చూసిన స్థానికులు అతడ్ని ఓ పిచ్చోడేమో అనుకున్నారు.

కానీ ఆ వ్యక్తే చెప్పులు, బూట్లతో వేల డాలర్లు పొందుతున్నాడని గ్రహించలేకపోయారు.విలువైన అద్బుతమైన ఆర్ట్స్ తయారు చేస్తుండటం అక్కడి ప్రజలకు వింతగా అనిపించింది.

"""/"/వెస్ట్ ఆఫ్రికాలో చాలామంది సముద్రాలలోనే వ్యర్థ పదార్థాలు, వస్తువులను పడేస్తుంటారు.అయితే సముద్ర అలల కారణంగా ఆ వస్తువులన్నీ ఒడ్డుకు చేరుకుంటాయి.

ఆ వస్తువులను అరిస్టైడ్ తీసుకుని చక్కటి ఆర్ట్స్ గా తయారు చేస్తాడు.ఇలాంటి వస్తువులతో మంచి ఆర్ట్స్ చేయడం గొప్ప అనుభూతిని ఇవ్వడమే కాకుండా పర్యావరణాన్ని కాపాడినట్లుగా కూడా ఉంటుందని కౌమే చెబుతున్నాడు.

చాలా రోజుల నుంచి అతడు చేస్తున్న పనికి మంచి గుర్తింపు లభించింది.అతడి కళాకృతులను ఐవరీ కోస్ట్ కళా సంస్థ చూసి ప్రశంసలు గుప్పించింది.

ఈ ఆర్ట్స్ వర్క్స్ ఐవరీ కోస్ట్ ప్రాంతంతోపాటు విదేశాల్లోని గ్యాలరీ గోడలు, ఇళ్లలో ఉంచుకుంటున్నారు.

కవల పిల్లలకు జన్మనిచ్చిన ప్రముఖ సీరియల్ నటి కరుణ.. కంగ్రాట్స్ అంటూ?