ఒక్క ప్లాప్ తో సురేందర్ రెడ్డి కెరియర్ పోయినట్లేనా..?అసలు ఇప్పుడు సురేందర్ రెడ్డి ఏం చేస్తున్నాడు..?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీకి అతనొక్కడే సినిమాతో తనదైన రీతిలో ఎంట్రీ ఇచ్చిన డైరెక్టర్ సురేందర్ రెడ్డి( Surender Reddy ).
ప్రస్తుతం సురేందర్ రెడ్డి సినిమాలేమీ చేయకుండా ఖాళీగా ఉంటున్నాడు.ఇక దానికి కారణం ఏంటి అంటే అక్కినేని అఖిల్ తో చేసిన ఎజెంట్ సినిమా భారీ డిజాస్టర్ కావడమే దానికి ముఖ్య కారణంగా తెలుస్తుంది.
ఇక ఈ సినిమా నార్మల్ ప్లాప్ కాకుండా భారీ డిజాస్టర్ గా మిగడమే దానికి ముఖ్య కారణం ఎందుకంటే భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ప్రొడ్యూసర్స్ కి భారీ నష్టాలను మిగిల్చింది.
"""/" /
అలాగే సురేందర్ రెడ్డి కెరియర్ ను కూడా బాగా డామేజ్ చేసింది.
ఇక అందుకే ఆయనకి సినిమాలు ఇచ్చే స్టార్ హీరోలు ఎవరు దొరకడం లేదు.
కాబట్టి తను మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేసి తన తన ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.
ఇక మధ్య పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తో ఒక సినిమా చేస్తున్నాడు ఎంటి కొన్ని వార్తలు వచ్చినప్పటికీ, అందులో ఎంత మాత్రం నిజం లేదనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది.
ఇక దాంతో ఆయన ఇప్పుడు యంగ్ హీరో అయిన రామ్( Ram Pothineni ) తో ఒక సినిమా చేసి ఆ తర్వాత తనని తాను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
"""/" /
ఇక దానికి సంబంధించిన చర్చలు జరుపుతున్నట్లుగా వార్తలైతే వస్తున్నాయి.ఇక ఇప్పటికే రామ్ కి కూడా కొన్ని కథలు వినిపించినట్టుగా తెలుస్తుంది.
ఇక సురేందర్ రెడ్డి చెప్పిన కథలకి రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా లేదా అనే విషయాలు కూడా చేయాల్సి ఉంది.
ఇక మొత్తనికైతే ఈ సినిమాతో తనను తాను చాలా గ్రాండ్ గా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నాలైతే చేస్తున్నాడు.
చూడాలి మరి సురేందర్ రెడ్డి ఈ సినిమాతో సక్సెస్ కొట్టి స్టార్ హీరోలను డైరెక్ట్ చేసే స్థాయికి ఎదుగుతాడా లేదా ఫ్లాప్ డైరెక్ట్ గా మిగిలిపోతాడు అనేది.
ఈ బాలుడు మృత్యుంజయుడా.. మూడో అంతస్తు నుంచి పడినా బతికే ఉన్నాడు.. వీడియో చూడండి!