రక్షాబంధన్ స్పెషల్.. రాఖీ కట్టేటప్పుడు తప్పకుండా ఉండాల్సిన వస్తువులు!

అన్నా - చెల్లెలు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా రక్షాబంధన్ పండుగను నిర్వహించుకుంటారు.ఈ పండుగ సోదర సోదరీమణులకు ఎంతో ముఖ్యమైన పండుగ అని చెప్పవచ్చు.

తన సోదరుడు జీవితంలో అత్యున్నత స్థానానికి ఎదగాలని, దీర్ఘాయుష్షు డై ఉండాలనే తన సోదరి రాఖీ కట్టగా, అందుకు సోదరీమణులకు విలువైన బహుమతులను కానుకగా ఇస్తుంటారు.

ఈ క్రమంలోనే ప్రతి ఏటా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమిని రాఖీ పౌర్ణమిగా ఈ పండుగను ప్రపంచవ్యాప్తంగా ఎంతో వేడుకగా జరుపుకుంటారు.

ఎంతో పవిత్రమైన ఈ పండుగ రోజు తమ సోదరుడికి రాఖీ కట్టే సమయంలో తప్పకుండా ఈ వస్తువులను ఉంచాలనే పండితులు చెబుతున్నారు.

రాఖీ పౌర్ణమిరోజు మంచి తిథిలో రాఖీ కట్టడం వల్ల వారి జీవితంలో అంతా శుభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.

ఈ క్రమంలోనే యమగండం, రాహుకాల లో రాఖీలను కట్టకూడదు.రాఖీ ఎల్లప్పుడూ కూడా సంపూర్ణ చందమామ దర్శనం ఇచ్చిన సమయంలో మాత్రమే కట్టాలని పండితులు చెబుతున్నారు.

మరి రాఖీ కట్టే సమయంలో ఏ వస్తువులను పెట్టాలి అనే విషయానికి వస్తే.

"""/"/ రాఖీ కట్టే సమయంలో ట్రేలో తప్పనిసరిగా కుంకుమ, అక్షింతలు, స్వీట్స్, రాఖి తప్పనిసరిగా ఉండాలని పండితులు చెబుతున్నారు.

ముందుగా రాఖి కట్టేటప్పుడు రాఖీని బియ్యంలో ఉంచి దానికి పసుపు కుంకుమ పెట్టాలి.

ఆ తర్వాత మన సోదరుడికి రాఖీ కట్టే సమయంలో ముందుగా తన నుదుటిపై కుంకుమ పెట్టాలి.

కుంకుమను దీర్ఘాయుష్షు, అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు కనుక ముందుగా కుంకుమ పెట్టి తలపై అక్షతలు వేయాలి.

అక్షింతలు అంటే పరాజయం లేనిది అని అర్థం.అయితే అక్షింతలు చేసేటప్పుడు ఎల్లప్పుడూ కూడా సంపూర్ణంగా ఉండే బియ్యాన్ని చేయాలిగాని విరిగిన బియ్యంతో అక్షింతలు తయారు చేయకూడదు.

"""/"/ ఈ విధంగా పసుపు కుంకుమ పెట్టిన రాఖీని తన సోదరుని చేతికి కట్టి ఆ తర్వాత ఏదైనా మిఠాయిలను తన సోదరునికి తినిపించాలి.

ఈ విధంగా మిఠాయిలను తినిపించడం వల్ల వారిద్దరి మధ్య ఉన్న బంధం ఎల్లప్పుడూ ఎంతో తీయగా, ఎలాంటి కలహాలు లేకుండా ఉంటుందని చెప్పవచ్చు.

ఈ విధంగా రాఖీ కట్టే సమయంలో తప్పకుండా ఈ వస్తువులు ఉండాలని పండితులు చెబుతున్నారు.

రాఖీ కట్టిన తర్వాత సోదరుడు ఎంతో విలువైన కానుకలను తన సోదరికి బహుమతిగా ఇస్తారు.

Mahesh Babu : గడ్డకట్టే మంచులో ఎంజాయ్ చేస్తున్న మహేష్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు?