ఆ డెయిరీ ప్రొడక్ట్ తిన్న వెంటనే చనిపోయిన యువతి.. వైద్యులు షాక్…

కొంతమందికి కొన్ని ఫుడ్స్ కంప్లీట్‌గా సురక్షితమైనవి అయితే మరికొంతమందికి మాత్రం అవి ప్రాణాంతకం అవుతాయి.

అరటిపండు తిన్నా అదృష్టం బాగోకపోతే పన్ను విరిగిద్ది అన్నట్లు కొందరికి పాల ఉత్పత్తులు తిన్నా ప్రాణాలు పోతాయి.

తాజాగా ఇటలీలో( Italy ) అదే జరిగింది.అన్నా బెల్లిసారియో( Anna Bellisario ) అనే 20 ఏళ్ల యువతి డెయిరీ ప్రొడక్ట్స్‌ అసలు తినలేదు.

ఎందుకంటే ఆమెకు డెయిరీ అలెర్జీ( Dairy Allergy ) ఉంది.ఆమె పాలు లేదా జున్నుతో చేసిన ఏదైనా వంటకం తింటే, చాలా అనారోగ్యానికి గురవుతుంది లేదా చనిపోయే ప్రమాదం కూడా ఉంది.

అందుకే పాల ఉత్పత్తులు లేని ఆహారాలను ఆమె తింటూ ఉంటుంది.రెస్టారెంట్‌లో ఏదైనా తినడానికి ముందు ఆమె ఎల్లప్పుడూ లేబుల్స్‌ను చెక్ చేస్తుంది, సిబ్బందిని అడిగి పాల ఉత్పత్తులు( Milk Products ) లేవని నిర్ధారించుకున్న తర్వాతే ఆర్డర్ చేస్తుంది.

"""/" / అయితే ఇటీవల ఆమె, ఆమె ప్రియుడు ఇటలీలోని మిలాన్‌లోని ఫ్లవర్ బర్గర్ అనే శాకాహారి బర్గర్ ప్లేస్‌కి వెళ్లారు.

వారు వేగాన్( Vegan ) అని భావించే శాఖాహార డెజర్ట్‌ను ఆర్డర్ చేసారు, అంటే అందులో జంతు ఉత్పత్తులు లేవు అనుకున్నారు.

కానీ డెజర్ట్‌లో వాస్తవానికి పాలు( Milk ) కలిసాయి.అన్నాకి ఆ సంగతి తెలియదు.

దాంతో ఆమె డెజర్ట్‌లో కొన్ని స్పూన్లు తిని నిమిషాల వ్యవధిలోనే అస్వస్థతకు గురయింది.

ఆపై దగ్గు ఆమెలో మొదలయ్యింది.చివరికి గట్టిగా ఊపిరి పీల్చుకోవడం ప్రారంభించింది.

అనంతరం బాత్‌రూమ్‌కి పరిగెత్తింది. """/" / ఆమె ఉబ్బసం కోసం మెడిసిన్, కార్టిసోన్ అనే మరొక మెడిసిన్ ఉపయోగించడానికి ప్రయత్నించింది, కానీ అవి ఆమెను కాపాడలేకపోయాయి.

ఆమెకు అనాఫిలాక్టిక్ షాక్( Anaphylactic Shock ) అనే చాలా ప్రాణాంతకమైన అలెర్జీ రియాక్షన్ వచ్చింది.

ఆస్పత్రికి తీసుకెళ్లినా పది రోజులైనా నిద్ర లేవలేదు.చివరికి ఆమె మరణించింది.

అన్నా ఆమె పుట్టినప్పటి నుండి ఈ అలెర్జీని కలిగి ఉంది, ఆమె తరచుగా ఫ్లవర్ బర్గర్‌ రెస్టారెంట్( Flower Burger Restaurant ) వద్ద ఆహారం తింటుంది.

డెజర్ట్‌లో పాలు ఉన్నట్లు గుర్తించిన ఇటలీ ప్రభుత్వం దానిని మరో 63 రెస్టారెంట్ల నుంచి సేకరించింది.

ఆమె తిన్న శాండ్‌విచ్‌లో గుడ్డు ఉందని, అది ఆమెకు అలెర్జీ అని కూడా వారు ప్రభుత్వం కనిపెట్టింది.

"""/" / తల్లి, కుమార్తె నడుపుతున్న తిరామిసు( Tiramisu Bakery ) అనే బేకరీ నుంచి డెజర్ట్ వచ్చింది.

అన్నాను పొరపాటున హత్య చేశారన్న కోణంలో ఇప్పుడు విచారణ జరుపుతున్నారు.వారు రెండు వేర్వేరు డెజర్ట్‌లను మిక్స్ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

డెజర్ట్‌ గురించి నిజాయితీగా చెప్పకపోవడం ఆమె మరణానికి కారణమైందని ఆరోపిస్తున్నారు.డెజర్ట్ చెడిపోలేదని పోలీసులు అనుకుంటున్నారు, ఆ తీపి పదార్థం బాగానే ఉంది.

అన్నా చావుకు పాలు, గుడ్డు, లేదా రెండూ కారణమయ్యాయా అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు.

అయితే ఈ కేసు గురించి విన్న వైద్యులు షాక్ అవుతున్నారు.

అల్లు అర్జున్ జాతకం పై వేణు స్వామి కామెంట్స్… అసలు సినిమా ముందుంది అంటూ?