30 ఏళ్లుగా పరారీలో ఉన్న మోస్ట్ వాంటెడ్ మాఫియాను పోలీసులు ఎలా పట్టుకున్నారంటే..

ఇటలీకి చెందిన పోలీసులు ఘన విజయాన్ని సాధించారు.గత 30 ఏళ్లుగా పరారీలో ఉన్న మోస్ట్ వాంటెడ్ మాఫియా మాటియో మెస్సినా డెనారో పోలీసులకు చిక్కాడు.

60 ఏళ్ల మాఫియా డెనారోను సిసిలీ రాజధాని పలెర్మోలోని ఆసుపత్రిలో అరెస్టు చేశారు.

డెనారో క్యాన్సర్‌తో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.ఈ భయంకరమైన మాఫియాను అరెస్టు చేసిన బృందంలో 100 మంది పోలీసులు ఉన్నారు.

నేరస్థునికి 2002లో పలు హత్య కేసుల్లో జీవిత ఖైదు పడింది.అయితే డెనారో 1993 నుండి పరారీలో ఉన్నాడు.

రహస్యంగా తన దోపిడీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు.1992లో మాఫియా వ్యతిరేక ప్రాసిక్యూటర్లు గియోవన్నీ ఫాల్కోన్, పాలో బోర్సెల్లినో హత్యకు గురయ్యారు.

ఈ హత్య కేసులో మాటియో మెస్సినా డెనారోకు జీవిత ఖైదు విధించారు.ఇంతేకాకుండా 1993 సంవత్సరంలో మిలన్ ఫ్లోరెన్స్, రోమ్‌లలో డెనారో బాంబు దాడులు చేశాడు.

ఇందులో 10 మంది చనిపోయారు.డెనారో ప్రభుత్వానికి సాక్షిగా ఉన్న 11 ఏళ్ల బాలుడిని చిత్రహింసలు పెట్టి చంపాడు.

H3 Class=subheader-styleకోసా నోస్ట్రా సిండికేట్ దురాగతాలు/h3p కోసా నోస్ట్రా అనేది ఒక వ్యవస్థీకృత క్రైమ్ సిండికేట్.

ఇది క్రూరత్వం, విధ్వంసం, ప్రతీకార భావజాలలకు ప్రసిద్ధి చెందింది.1980లో కోసా నోస్ట్రా ముఠా ఇటాలియన్ అధ్యక్షుడు సెర్గియో మట్టరెల్లా సోదరుడిని చంపింది.

డెనారో ఈ సంస్థ కోసం మనీలాండరింగ్, డ్రగ్స్ ట్రాఫికింగ్, రాకెటింగ్ కోసం కూడా పని చేసేవాడు.

అతను 23 ఏళ్లపాటు తప్పించుకుని తిరుగుతూ 1993లో అరెస్టయిన కార్లియోన్ వంశానికి అధిపతి టోటో రీనాకు సన్నిహితుడు.

చాలా ముఖ్యమైన సమాచారాన్ని కలిగి ఉన్న కోసా నోస్ట్రా ముఠాలో డెనారో చివరి సభ్యుడు అని చెబుతారు.

అనేక ఉన్నత స్థాయి నేరాలకు పాల్పడిన వ్యక్తుల పేర్లు కూడా అతనికి తెలుసు.

మెస్సినా డెనారో 1993 నుండి పరారీలో ఉన్నాడు.అయితే ఇప్పుడు పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

"""/"/ H3 Class=subheader-styleదశాబ్దాలుగా డెనారో వేటలో పోలీసులు/h3p మెస్సినా డెనారోను అరెస్టు చేసేందుకు దశాబ్దాలుగా పోలీసులు ఉచ్చు బిగించారు.

పలుమార్లు పోలీసులు అతని దగ్గరకు చేరుకున్నా అరెస్టు చేయలేకపోయారు.2013లో పోలీసులు డెనారో సోదరి ప్యాట్రిసియా, కొంతమంది సహచరులను అరెస్టు చేశారు.

పోలీసులు అతని అనేక వ్యాపారాలను స్వాధీనం చేసుకున్నారు.అతనిని ఒంటరిగా చేశారు.

కానీ అతన్ని పట్టుకోలేకపోయారు.డెనారో అరెస్టు తర్వాత, దక్షిణ ఇటలీలో మాఫియాను తుడిచిపెట్టవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

"""/"/ H3 Class=subheader-styleడెనారోను గుర్తించడం చాలా కష్టం/h3p మెస్సినా డెనారో గుర్తింపు విషయంలో పోలీసులు పెద్ద పరీక్షను ఎదుర్కొన్నారు.

అతడికి సంబంధించిన కొన్ని పాత ఫొటోలు మాత్రమే పోలీసులకు లభ్యమయ్యాయి.అతని వాయిస్ రికార్డింగ్ 2021 సంవత్సరం వరకు కూడా విడుదల కాలేదు.

సెప్టెంబర్ 2021లో డెనారో అని పొరపాటుగా భావించి, మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

ఓరి నాయనో, నోట్ల కట్టలతో రాజస్థాన్ టెంపుల్‌ నిండిపోయింది.. కానుకలు లెక్కించడానికే 5 రోజులు?