శివ సినిమా వచ్చి అప్పుడే 35 సంవత్సరాల అవుతుందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం చాలా గొప్ప సినిమాలు వస్తున్నాయి.అయితే ఇప్పుడు వస్తున్న సినిమాలన్నీ కూడా తమదైన రీతిలో వైవిధ్యమైన కథాంశాలతో రావడమే కాకుండా సూపర్ సక్సెస్ ఫుల్ సినిమాలుగా కూడా మిగులుతున్నాయి.

మరి ఇలాంటి సందర్భంలో వస్తున్న సినిమాలు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాయి అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది.

"""/" / ఇక ఒకప్పుడు నాగార్జున( Nagarjuna) హీరో రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma) దర్శకత్వంలో వచ్చిన శివ సినిమా ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించింది.

ప్రస్తుతం ఈ సినిమా వచ్చి 35 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ సినిమా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తున్నారు.

నిజానికి ఈ సినిమా లేకపోతే మాత్రం నాగార్జున స్టార్ హీరోగా వెలుగొందేవాడు కాదు.

మొత్తానికైతే ఈ సినిమాతో ఒక్కసారిగా ఆయన స్టార్ట్ డమ్ ను అందుకోవడమే కాకుండా టాప్ హీరో రేంజ్ కి వెళ్లిపోయాడు.

"""/" / అంతకుముందు నాగార్జున అంటే యాక్టింగ్ సరిగ్గా రాదు అతను హీరోగా పనికిరాడు అని చాలామంది విమర్శించారు.

ఇక అలాంటి వాళ్లే శివ సినిమా( Siva )ను చూసి నాగార్జున స్టార్ హీరో అంటూ ఒప్పుకోవడమే కాకుండా అతనితో సినిమాలు చేయడానికి ముందుకు వచ్చారు.

నాగార్జున లో ఉన్న స్టార్ డమ్ ని బయటకు తీసింది మాత్రం రామ్ గోపాల్ వర్మ అనే చెప్పాలి.

ఇక వర్మ కి ఇది మొదటి సినిమా అయినప్పటికీ తన మార్కు చూపించడమే కాకుండా ప్రేక్షకుల నాడి పట్టుకోని మరి వారిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు.

ఇక మొత్తానికైతే ఈ సినిమాతో పెను ప్రభంజనం సృష్టించిన వర్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ తలరాతను మార్చాడనే చెప్పాలి.

తండ్రి వెల్డింగ్ షాప్ లో ఉద్యోగి.. కూతురు టెట్ టాపర్.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!