అది తొలిసారిగా కాలుష్య భూతం ఇచ్చిన డెట్ స‌ర్టిఫికెట్‌!

వాయు కాలుష్యం కారణంగా ప్రపంచంలో కొన్ని మిలియన్ల మంది ప్రజలు ప్రతీ సంవత్సరం మరణిస్తున్నారు.

అయితే ప్రపంచంలో ఎక్కడా.ఏ వ్యక్తి మరణ ధృవీకరణ పత్రంలో వాయు కాలుష్యం అత‌ని లేదా ఆమె మరణానికి కారణమని పేర్కొన‌లేదు.

అయితే ఇప్పటివరకు ఒకే ఒక్కసారి మాత్రమే వాయుకాలుష్యం కార‌ణంగా మ‌ర‌ణ సంభ‌వించిద‌ని పేర్కొంటూ డెత్ స‌ర్టిఫికెట్ ఇచ్చారు.

అయితే దీని కోసం సుదీర్ఘ న్యాయ పోరాటం జరిగింది.సుమారు 7 సంవత్సరాల పాటు ఇది కొనసాగింది.

2013వ‌ సంవత్సరంలో బ్రిటన్‌లోని తొమ్మిదేళ్ల బాలికకు ప్రాణాంతకమైన ఆస్తమా ఉన్నట్లు నిర్ధారణ అయింది.

ఆ తర్వాత ఆమె మరణానికి కారణం వాయు కాలుష్యం అని ఆమె మరణ ధృవీకరణ పత్రంలో పేర్కొన్నారు.

ఎల్లా కోయి డెబోరా అనే లండన్ నివాసి మరణించిన ఏడేళ్ల తర్వాత ఆ చిన్నారి మరణానికి కారణం వాయు కాలుష్యం అని పాప‌ మరణ ధృవీకరణ పత్రంపై రాయాల‌ని ఆర్డర్ జారీ అయ్యింది.

దీని తరువాత ఎల్లా మరణ ధృవీకరణ పత్రం కాలుష్యం కారణంగా సంభ‌వించిన మరణం అని పేర్కొంటూ.

ఇది అధికారికంగా విశ్వసించిన మొదటి కేసుగా గుర్తించారు.దీంతో ప్రపంచవ్యాప్తంగా వాయుకాలుష్యం కారణంగా ఏటా మరణిస్తున్న లక్షలాది మందికి ఎల్లా మరణ ధృవీకరణ పత్రం ఒక ముంద‌డుగు కానుంది.

ఎల్లా కోయి డెబోరా తల్లి తన కుమార్తె మరణం నేప‌ధ్యంలో బ్రిటన్‌లోని వాయు కాలుష్య సమస్యపై సుదీర్ఘ పోరాటం చేసింది.

2014లో నిపుణులు కూడా ఎల్లా మరణానికి కారణం ఆమె శ్వాసకోశ వ్యవస్థ వైఫల్యం అని ప్రకటించారు.

కానీ ఆమె రెండవ విచారణను కోరింది.చివరకు డిసెంబర్ 2020లో ఆమె ఈ యుద్ధంలో గెలిచింది.

ఉబ్బసంతో బాధ‌ప‌డుతున్న‌ చిన్నారి ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతిన‌డం మరణానికి కారణమై ఉండవచ్చని కోర్టు పేర్కొంది.

అయితే ఎల్లా చికిత్స సమయంలో లండన్‌లో వాయు కాలుష్యం యూరోపియన్ యూనియన్ ప్రమాణాల స్థాయిలో అత్య‌ధికంగా ఉందని కోర్టు త‌న తీర్పులో వివ‌రించింది.

తాగునీటితో బైక్ కడుగుతూ అడ్డంగా బుక్కైన హైదరాబాదీ.. చుక్కలు చూపించిన అధికారులు!