అహింస ఫ్లాప్ అని ముందే తెలుసు… డైరెక్టర్ కామెంట్స్ వైరల్!

నిర్మాత సురేష్ బాబు( Suresh Babu ) చిన్న కుమారుడు అభిరామ్ ( Abhi Ram ) ను ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేస్తూ దర్శకుడు తేజ( Teja ) అహింస ( Ahimsa ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఇలా అభిరామ్ అహింస సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది.

ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత మొదటి షో నుంచి నెగిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో కలెక్షన్లు కూడా పూర్తిగా పడిపోయాయి.

మొత్తానికి ఈ సినిమా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుందనే చెప్పాలి.ఇండస్ట్రీకి ఎంతో మందిని పరిచయం చేసినటువంటి తేజ అందరికీ మంచి సక్సెస్ అందించారు.

"""/" / ఇక అభిరామ్ చేసిన ఈ సినిమా కూడా హిట్ అవుతుందని అందరూ భావించారు.

కానీ ఈ సినిమా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.అయితే ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని డైరెక్టర్ తేజ ముందుగానే చెప్పినటువంటి ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఈ సినిమా షూటింగ్ సమయంలోనే సురేష్ బాబు ఈ సినిమా రిజల్ట్ చెప్పేసారని తాజాగా తేజ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఈ సినిమా 90% షూటింగ్ పూర్తి జరిగిన తర్వాత ఒకరోజు సురేష్ బాబు గారు తన వద్దకు వచ్చారని తెలిపారు.

"""/" / తన వద్దకు వచ్చినటువంటి సురేష్ బాబు రషెస్ చూసి బాగా చేయలేదని చెప్పారు.

బాగా చేయలేదు కదా ఎందుకు తీశారు ఆపే లేకపోయారా అంటూ తనని ప్రశ్నించారని తేజ తెలిపారు.

సురేష్ బాబు ఇలా అనడంతో తాను కూడా మాట్లాడుతూ నేను ఈ సినిమాని డబ్బుల కోసం చేయలేదు.

కేవలం రామానాయుడు( Rama Naidu ) గారికి తన మనవడిని ఇండస్ట్రీకి పరిచయం నేనే చేస్తాను అని ఇచ్చిన మాట కోసమే ఈ సినిమా చేస్తున్నానని తేజ చెప్పడంతో సురేష్ బాబు కూడా ఎమోషనల్ అవుతూ సినిమాని కంటిన్యూ చేయమని చెప్పారు.

ఇలా ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని తమకు ముందే తెలుసు అంటూ తేజ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.