ప్రాణనష్టం జరగకుండా చూడాలి.. : మంత్రి కేటీఆర్

తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి కేటీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు.

పారిశుద్ధ్య నిర్వహణ, సురక్షిత తాగునీటి సరఫరా, వ్యాధులు రాకుండా చేపట్టాల్సిన కార్యక్రమాలపై అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

సహాయ కార్యక్రమాలను సవాలుగా తీసుకొని ముందుకు వెళ్లాలని తెలిపారు.అధికారులు, సిబ్బందికి సెలవులను ఇప్పటికే రద్దు చేశారని పేర్కొన్నారు.

ప్రాణనష్టం జరగకుండా చూడటమే అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవాలన్నారు.పట్టణాలో చెరువులు నిండాయన్న కేటీఆర్ ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు.

అవసరం అయితే లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించాలని వెల్లడించారు.దాంతో పాటు ప్రతి పట్టణంలో ప్రత్యేకంగా పారిశుద్ధ్య డ్రైవ్ ను చేపట్టాలని తెలిపారు.

అన్నం గంజిలో ఇవి కలిపి జుట్టుకు రాస్తే మీ హెయిర్ డబుల్ అవుతుంది..!