మూడేండ్ల కిందట వైఎస్ వివాకా దారుణ హత్యతో చుట్టుముట్టిన వివాదాలు ఒకవైపు, కొత్త జిల్లాల ఏర్పాటు చిక్కులు మరోవైపు తలకుమించిన భారంగా మారుతున్నాయా ? అంటే అవుననే సమాధానం వస్తోంది.
పులివెందులతోపాటు అనేక ప్రాంతాల్లో కొత్త జిల్లాల చిచ్చువెరసి కంచుకోటలా ఉన్న సీట్లకు ఎసరుపెడుతున్న పరిస్థితి.
ఇందుకు రాజంపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్‌రెడ్డి వ్యవహరిస్తున్న తీరు ఇందుకు అద్దంపడుతోంది.
సొంత పార్టీలోనే అనేక అనుమానాలు లేవనెత్తుతూ చర్చకు దారితీస్తున్నారు.అయితే రాజంపేట జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలంటూ పెద్ద ఎత్తున ఉద్యమం రాజుకుంది.
ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లికార్జున్‌రెడ్డి కూడా ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం.ఉద్యమంలోనూ పాల్గొని కొత్త జిల్లాల గళం కూడా వినిపించారు.
రాయచోటిని కొత్త జిల్లా కేంద్రం చేయడమేంటని అవాకులు చెవాకులు విసిరారు.రాయచోటిని కొత్త జిల్లాగా ప్రకటించడంతో రాజంపేటతో పాటు రైల్వే కోడూరులో వైసీపీకి తీవ్ర వ్యతిరేకత వచ్చింది.
దీనికి తోడు మూడేండ్ల వైసీపీ పాలనపై కూడా ప్రజల్లో వ్యతిరేకత నెలకొందనే భావనలో మల్లికార్జున్‌రెడ్డి ఉన్నట్టు తెలిసింది.
దీంతో వచ్చే ఎన్నికల నాటికి పార్టీ మారతారా ? అనే సందేహం వ్యక్తమవుతోంది.
"""/"/
పొలిటికల్ గ్రాఫ్‌లో మల్లికార్జున్‌రెడ్డి వరుసగా మూడు సార్లు గెలుచుకుంటూ వచ్చి హ్యట్రిక్ ఎమ్మెల్యేగా నిలిచాడు.
ఇక్కడో విచిత్రం కూడా ఉంది.అతను మూడు సార్లు మూడు పార్టీల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాడు.
2009లో వైఎస్సార్ చలువతో కాంగ్రెస్ తరపున గెలిచాడు.వైఎస్సార్ మరణం అనంతరం కాంగ్రెస్‌లోనే ఉన్నారు.
రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రుల వద్ద మంచి పేరు గడించి తన వ్యాపారాలు విస్తరింపజేసుకున్నారు.
2014లో టీడీపీ రేస్ లో ఉందని అందులోకి వాలిపోయాడు.రాజంపేట నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
మూడోసారి 2019లో వైసీపీ రేస్‌లో ఉండడంతో అందులో చేరి ఎమ్మెల్యేగా గెలిచి హ్యట్రిక్ కొట్టాడు.
అయితే కొత్త జిల్లాల వివాదం, వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపుపై అనుమానాలతో రాజంపేట ఎమ్మెల్యే మల్లికార్జున్‌రెడ్డి పార్టీ మారతాడనే ప్రచారం జరుగుతోంది.
మొత్తానికైతే వైసీపీలో ఈ ఎమ్మెల్యే అంశం చర్చగా మారినా.ఆయన ఏంచేయబోతాడనేది వేచి చూడాల్సిందే.