మాజీ ఎంపీ పొంగులేటి నివాసంలో ఐటీ దాడులు..!
TeluguStop.com
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిలో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి.
సుమారు ఏడు గంటలుగా అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.ఈ మేరకు పొంగులేటి నివాసంతో పాటు పాలేరులోని క్యాంపు కార్యాలయంలో అధికారులు ఏకకాలంలో దాడులు కొనసాగుతున్నాయి.
ఎనిమిది వాహనాల్లో వచ్చిన అధికారులు తనిఖీలు చేస్తున్నారు.ఖమ్మంతో పాటు హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ నివాసంలోనూ ఐటీ అధికారులు సోదాలు చేశారు.
ఈ క్రమంలో పొంగులేటి సిబ్బంది ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.అయితే పొంగులేటి నామినేషన్ దాఖలు చేసే సమయంలో కావాలనే ఐటీ దాడులు చేస్తుందని కాంగ్రెస్ కార్యకర్తలు మండిపడుతున్నారు.
సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్ వెనక ఉన్న అసలైన హీరో ఎవరంటే..?