బాబుకి ఐటీ నోటీసులు ! జనసేననూ టార్గెట్ చేసిన వైసీపీ 

చంద్రబాబు( N Chandrababu Naidu )ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 118 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నారని , దీనికి సంబంధించిన సాక్షాలు ఉన్నాయని పేర్కొంటూ ఐటీ శాఖ చంద్రబాబుకు నోటీసు ఇవ్వడం ఏపీలో రాజకీయంగా కలకలం రేపింది.

ఈ అంశాన్ని హైలెట్ చేసుకుని వైసిపి టిడిపిని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తుంది.

పదేపదే చంద్రబాబుకు ఐటి నోటీసు వ్యవహారంపై స్పందిస్తూ దానికి సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేస్తుంది.

అయితే వైసిపి ఎన్ని రకాలుగా కవింపు ప్రయత్నాలు చేస్తున్న, ఈ విషయంలో టిడిపి నేతలు మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

ఈ వ్యవహారంపై స్పందించేందుకు అంత ఆసక్తి చూపించడం లేదు.దీనికి కారణం ఆ పార్టీ అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడమే కారణం .

అయితే ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలిపెట్టకూడదని ,  జనాలలోను చంద్రబాబు అవినీతి పై చర్చ జరిగే విధంగా చేయాలని వైసిపి భావిస్తూ అనేక విమర్శలు చేస్తోంది.

"""/" / టిడిపి తో పాటు,  ఈ వ్యవహారంపై జనసేన ను ఇరుకుని పెట్టే విధంగా వైసిపి వ్యూహాలు రచిస్తోంది.

దీనిలో భాగంగానే అవినీతి కేసులో చంద్రబాబుకు ఐటి నోటీసులు రావడం పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదని,  ఈ విషయంలో ఆ పార్టీ విధానం ఏమిటో చెప్పాలని వైసిపి డిమాండ్ చేస్తుంది.

గతంలో జగన్ ( CM Jagan )పై వచ్చిన అనేక ఆరోపణల విషయాన్ని ఇప్పటికీ ప్రస్తావిస్తూ , పవన్ చంద్రబాబులపై విమర్శలు చేస్తూనే వస్తున్నారని , కానీ చంద్రబాబు చేసిన అవినీతికి సాక్ష్యాలు ఉన్నాయని ఐటీ శాఖ నోటీసులు జారీ చేయడంపై పవన్ ఎందుకు స్పందించడం లేదని వైసిపి ప్రశ్నిస్తోంది.

తీగలాగితే పవన్ ప్యాకేజీ అంశం బయటపడుతుందని పవన్ కు భయమా అంటూ వైసిపి నాయకులు ప్రశ్నిస్తున్నారు.

చంద్రబాబు ఆయన దత్తపుత్రుడు కలిసి అవినీతికి పాల్పడ్డారని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నా,  అటు టిడిపి,  ఇటు జనసేన నుంచి ఏ స్పందన రావడం లేదు.

అవినీతి ఎక్కడున్నా,  ఏ రూపంలో ఉన్నా, అది ఎవరు చేసినా ప్రశ్నిస్తానని ,అది నా హక్కు అంటూ గతంలో అనేక సందర్భాల్లో మాట్లాడిన పవన్ ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నిస్తున్నారు.

"""/" /  వచ్చే ఎన్నికల్లో టిడిపి తో పొత్తు పెట్టుకునేందుకు పవన్ కళ్యాణ్( Pavan Kalyan ) ప్రయత్నిస్తున్నారని,  అందుకే ఈ విషయంలో నోరు విప్పేందుకు సాహసం చేయలేకపోతున్నారని అధికార పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు.

చంద్రబాబు దొంగ అయినా పవన్ కళ్యాణ్ ఒప్పుకోడని ,హీరో అనే అంటాడని ఏపీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు.

చంద్రబాబుకు ఐటి నోటీసులు వ్యవహారాన్ని వదిలిపెట్టకూడదని,  జనాల్లోకి తీసుకువెళ్లి టిడిపి అవినీతి పార్టీ అని రుజువు చేయాలని వైసిపి భావిస్తోంది.

ఈ వ్యవహారంలో జనసేన ను కూడా ఇరుకున పెట్టే విధంగా వైసిపి వ్యూహాలు రచిస్తోంది.

.

పవన్ సినిమాలో నటి అనసూయ.. ఒక్క పోస్టుతో క్లారిటీ ఇచ్చిన నటి?