పాల‌తో క‌లిపి ఈ ఆహారాలు తీసుకుంటే చాలా డేంజ‌ర్‌.. తెలుసా?

పాలు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు.పౌష్టికాహారమైన పాలు ప్ర‌తి రోజు తీసుకుంటే.

ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.గుండె సంబంధిత జ‌బ్బుల‌ను దూరంగా చేయ‌డంలో, శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెంచ‌డంలోనూ, ఎముక‌ల‌ను మ‌రియు దంతాల‌ను దృఢంగా మార్చ‌డంలోనూ, నరాల పనితీరు మెరుగు ప‌ర‌చ‌డంలోనూ, శ‌రీరానికి కావాల్సిన ప్రోటీన్లు అందించ‌డంలోనూ, చ‌ర్మాన్ని నిగారింపుగా చేయ‌డంలోనూ ఇలా చెప్పుకుంటూ పోతే పాలు అనేక విధాలుగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

అందుకే పెద్ద‌లు, పిల్ల‌లు అనే తేడా లేకుండా అంద‌రూ పాల‌ను డైలీ డైట్‌లో చేర్చుకోవాల‌ని ఆరోగ్య నిపుణులు ఎప్ప‌టిక‌ప్పుడు చెబుతుంటారు.

అయితే పాలు ఆరోగ్యానికి మంచిదే అయిన‌ప్ప‌టికీ.కొన్ని ఆహారాల‌తో ఎప్పుడూ క‌లిపి తీసుకోరాదు.

మ‌రి ఆ ఆహారాలు ఏంటీ అన్న‌ది లేట్ చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.సాధార‌ణంగా కొంద‌రు పాలు మ‌రియు ఫ్రూట్స్ క‌లిపి తీసుకుంటుంటారు.

కానీ, పాల‌కు ముందు, తర్వాత లేదా పాల‌తో ఎప్పుడూ ఫ్రూట్స్ తీసుకోకూడద‌ని.అలా చేస్తే అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని నిపుణులు సూచిస్తున్నారు.

"""/"/ అలాగే మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారం, చేప‌లు, చికెన్, మ‌ట‌న్ వంటి మాంసాహారాలు తీసుకున్న వెంట‌నే కొంద‌రు పాలు లేదా పెరుగు తీసుకుంటారు.

కానీ, ఇలా ఎప్పుడూ చేయ‌డ‌కూడ‌దు.ఇవి ఒకేసారి తీసుకుంటే.

అర‌గ‌క గ్యాస్‌, ఎసిడిటీ, క‌డుపు ఉబ్బ‌రం వంటి స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.పాలు తాగిన వెంట‌నే పెరుగు లేదా పెరుగు తీసుకున్న వెంట‌నే పాలు ఎప్పుడూ తీసుకోకూడ‌దు.

ఇలా చేయ‌డం వ‌ల్ల వాంతులు, త‌ల తిప్ప‌డం వంటి స‌మ‌స్యలు ఏర్ప‌డ‌తాయి.ఇక కొంద‌రు ప‌లు కూర‌ల్లో పాలు క‌లిపి వండుతుంటారు.

అయితే ఇలా వండుకుని తిన‌డం వ‌ల్ల ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాద‌ని నిపుణులు చెబుతున్నారు.

అలాగే పాలు మ‌రియు అరటి పండు క‌లిపి కొంద‌రు తీసుకుంటుంటారు.కానీ, ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణక్రియపై తీవ్ర చెడు ప్ర‌భావం చూపుతుంద‌ని అంటున్నారు.

ఐపీఎల్ 2024: సిక్సర్లు, ఫోర్లతో రెచ్చిపోతున్న బ్యాటర్లకు కళ్లెం వేస్తున్న టాప్ బౌలర్లు వీళ్లే..??