బ‌రువు త‌గ్గాల‌నే ఉద్ధేశంతో ఈ త‌ప్పు‌లు చేస్తే.. చాలా డేంజ‌ర్‌?

నేటి కాలంలో అధిక బ‌రువు చాలా మందికి పెద్ద స‌మ‌స్య‌గా మారింది.ఈ అధిక బ‌రువు స‌మ‌స్య మ‌నిషిని ఆరోగ్య ప‌రంగానే కాకుండా.

మాన‌సికంగా కూడా దెబ్బ తీస్తుంది.అందుకే బ‌రువు పెరిగామ‌ని గ‌మ‌నించిన వెంట‌నే ఎలా వెయిట్ లాస్ అవ్వాలా అని అంద‌రూ తెగ హైరానా ప‌డిపోతుంటారు.

అయితే కొంద‌రు బ‌రువు త‌గ్గాల‌నే అతి ఉత్సాహంతో ఏవేవో ప్ర‌యోగాలు చేస్తుంటారు.ఈ క్ర‌మంలోనే తెలిసి తెలియ‌ని పొర‌పాట్లు కూడా చేస్తుంటారు.

కానీ, నిజానికి బ‌రువు త‌గ్గాలనుకునే వారు ఇప్పుడు చెప్ప‌బోయే త‌ప్పులు చేసినా, చేస్తున్నా.

చాలా డేంజ‌ర్‌.మ‌రి ఆ త‌ప్పులు ఏంటీ అన్న‌ది ఆల‌స్యం చేయ‌కుండా కింద‌కు ఓ లుక్కేసేయండి.

చాలా మంది త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గాల‌నే తాపత్రయంతో ఉద‌యం బ్రేక్ ఫాస్ట్‌ను స్కిప్ చేస్తుంటారు.

కానీ, రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే.బ్రేక్ ఫాస్ట్ తీసుకోవ‌డం త‌ప్ప‌ని స‌రి.

కానీ, బ్రేక్ ఫాస్ట్‌లో ఫ్యాట్ ఫుడ్స్‌, ఆయిలీ ఫుడ్స్ లేకుండా చూసుకోవాలి.అలాగే కొంద‌రు ఎంత డైటింగ్ చేసినా బరువు తగ్గరు.

అలాంటివారు, అదే డైట్ ఫాలో అవ్వ‌డం చాలా పొర‌పాటు.ఎంత డైటింగ్ చేసినా బ‌రువు త‌గ్గ‌లేదు అంటే.

వెంట‌నే డైట్ ప్లాన్ చేంజ్ చేసుకోవాలి అని అర్థం. """/" / కొంద‌రు భోజ‌నం త‌క్కువ తినాల‌నే ఉద్ధేశంలో.

మ‌ధ్య‌లో వాట‌ర్‌ను సేవిస్తుంటారు.నిజానికి ఇలా చేయ‌డం ఏ మాత్రం మంచిది కాదు.

భోజ‌నం మ‌ధ్య‌లో నీటిని తాగ‌డం వ‌ల్ల జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు నెమ్మ‌దిస్తుంది.

అలాగే బ‌రువు ఫాస్ట్‌గా త‌గ్గేందుకు కొంద‌రు కొవ్వుపదార్థాలు పూర్తిగా మానేస్తారు.కానీ, శరీరం సరిగ్గా పనిచేయాలంటే.

కొవ్వు ప‌దార్థాలు కూడా అవ‌స‌ర‌మే.కాబ‌ట్టి, శ‌రీరానికి ఎంత కొవ్వు కావాలో అంత ఖ‌చ్చితంగా తీసుకోవాలి.

అదేవిధంగా, కొందరైతే ఆహారం తగ్గించేసి త‌ర‌చూ పండ్ల‌ను, పండ్ల జ్యూసులను తీసుకుంటారు.అయితే పండ్లు ఆరోగ్యానికి మంచిదే అయిన‌ప్ప‌టికీ.

అతిగా తీసుకుంటే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.ఇక మ‌రికొంద‌రు డైట్ ఫాలో అవుతున్నాం క‌దా అని వ్యాయామాన్ని స్కిప్ చేస్తుంటారు.

కానీ, ఇలా చేయ‌డం చాలా త‌ప్పు.ఎంత డైట్ ఫాలో అయినా.

బ‌రువు త‌గ్గాలంటే వ్యాయామం చేయ‌డం త‌ప్ప‌నిస‌రి.

ఇక టార్గెట్ కొడాలి నాని ? అన్నీ సిద్ధం చేస్తున్నారా ?