Jana Sena: జనసేన పోటీ చేసేది ఈ నియోజకవర్గాలే ?  ఆ రెండిటి పై తర్జనభజన 

టిడిపి , జనసేన( TDP, Jana Sena ) పొత్తుల భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ , మూడు పార్లమెంట్ స్థానాలను టిడిపి కేటాయించింది .

ఈ నియోజకవర్గాల్లో ఐదు నియోజకవర్గాలకు అభ్యర్థులను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు.

ఇక తెలుగుదేశం పార్టీ 94 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది.ఇక జనసేన మిగిలిన 19 స్థానాలలో ఎవరిని అభ్యర్థులుగా ప్రకటిస్తుందనేది ఉత్కంఠ కలిగిస్తూనే ఉంది .

అదీ కాకుండా అసలు జనసేన ఏ ఏ నియోజకవర్గాల్లో పోటీ చేయబోతుంది ?  ఆ 19 నియోజకవర్గాల్లో ఏ ఏ జిల్లాలకు ఎక్కువ ప్రాధాన్యం దక్కింది అనేది అందరికీ ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉంటే నిన్న టిడిపి అధినేత చంద్రబాబుతో( Chandrababu ) పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా జనసేన పోటీ చేయబోయే నియోజకవర్గాల విషయంలో ఇద్దరు ఒక క్లారిటీ వచ్చినట్లు సమాచారం.

"""/" / అయితే జనసేన రెండు సీట్ల విషయంలో గట్టిగా పట్టుపడుతుండడంతో దీనిపై ఇంకా తద్దినభర్జన జరుగుతోందట.

ఆ రెండు స్థానాల విషయంలో క్లారిటీ రావాల్సి ఉండడంతో , మిగిలిన 17 నియోజకవర్గాల పై ఒక క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది.

ఇందులో అన్ని జిల్లాలలో జనసేనకు ప్రాతినిధ్యం దక్కే విధంగా చూస్తున్నారట.  ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 6 , తూర్పుగోదావరిలో 5 , విశాఖ జిల్లాలో 4,  కృష్ణాజిల్లాలో రెండు , శ్రీకాకుళం , విజయనగరం,  గుంటూరు,  ప్రకాశం,  చిత్తూరు,  కడప , అనంతపురం జిల్లాలో ఒక్కోచోట జనసేనకు సీటు కేటాయించినట్లు సమాచారం.

"""/" / శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ విజయనగరంలో( Palakonda In Vizianagaram ) నెలిమర్ల విశాఖలో విశాఖ దక్షిణ /పెందుర్తి/ మాడుగుల, అనకాపల్లి, ఎలమంచిలి, తూర్పుగోదావరిలో కాకినాడ రూరల్ రాజోలు రాజానగరం అమలాపురం / పి.

గన్నవరం పిఠాపురం, పశ్చిమగోదావరి జిల్లాలో నరసాపురం , భీమవరం,  తాడేపల్లిగూడెం , ఉంగుటూరు ,నిడదవోలు , పోలవరం, కృష్ణా జిల్లాలో విజయవాడ పశ్చిమ , అవనిగడ్డ,  గుంటూరులో తెనాలి,  ప్రకాశంలో దర్శి , చిత్తూరులో తిరుపతి, అనంతపురంలో అనంతపురం , కడప జిల్లాలో రైల్వే కోడూరులో జనసేన పోటీ చేయబోతుందట .

ఇక ఉమ్మడి విశాఖ జిల్లాలో పెందుర్తి సీటును జనసేన ఆశిస్తోంది.అయితే ఆ స్థానానికి బదులు మాడుగుల స్థానాన్ని తీసుకోవాలని టిడిపి ప్రతిపాదించిందట.

అలాగే అమలాపురం సీటును జనసేన కోరుతుండగా,  దానికి బదులు పి.గన్నవరం తీసుకోవాలని టిడిపి ప్రతిపాదించగా దీనిపైన పవన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.