అది మ‌న రైల్వేలో అత్యంత శక్తివంతమైన ఇంజిన్... దాని పూర్తి వివ‌రాలు తెలిస్తే..

భారతీయ రైల్వేలు ప్రధానంగా రెండు రకాల లోకోమోటివ్‌ల నుండి సేవలను తీసుకుంటాయి.అవి ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌లు, డీజిల్ లోకోమోటివ్‌లు.

ఇవి కాకుండా ఆవిరి లోకోమోటివ్ రైళ్లు కూడా న‌డుస్తున్నాయి.అత్యంత శక్తివంతమైన లోకోమోటివ్‌లు గూడ్స్ రైలును లాగడానికి ఉపయోగిస్తారు.

వాటికి మరింత శక్తివంతమైన ఇంజిన్ అవసరం.మే 2020 ప్రారంభం వరకు డ‌బ్లుఏజీ 11 భారతీయ రైల్వేలలో అత్యంత శక్తివంతమైన రైలు ఇంజిన్‌.

ఇది 11 వేల హార్స్‌పవర్ సామర్థ్యాన్ని కలిగి ఉంది.అయితే 18 మే 2020న డ‌బ్లుఏజీ 12 బీ రాక‌తో డ‌బ్లుఏజీ 11ను తొల‌గించారు.

డ‌బ్లుఏజీ 12 తరగతికి చెందిన డ‌బ్లుఏజీ 12బీ ఇంజిన్ అధికారికంగా తొలి ప్రయాణం ప్రారంభించింది.

ఇది బీహార్‌లోని పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ స్టేషన్ నుండి శివపూర్ వరకు మొదటి ప్రయాణాన్ని చేసింది.

ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ ఇంజిన్.ఇది మొత్తం 12 వేల హార్స్‌పవర్ సామర్థ్యాన్ని కలిగి ఉంది.

ప్రస్తుతం, డ‌బ్లుఏజీ 12 బీ భారతదేశంలో అత్యంత శక్తివంతమైన లోకోమోటివ్.ఇది ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన రైలు ఇంజన్ల జాబితాలో చోటు ద‌క్కించుకుంది.

ఈ ఇంజన్ గరిష్ట వేగం 120 కిలోమీట‌ర్ ప‌ర్ అవ‌ర్‌.ఇది 6000 టన్నుల బ‌రువును 120 కి.

మీ వేగంతో ముందుకు తీసుకువెళ్ల‌గ‌ల‌దు.

ఎటూ తేలని ‘ఖమ్మం ‘ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి  ? పోటీలో ప్రియాంక గాంధీ ?