ప్ర‌పంచంలోనే ఇది అత్యంత పెద్ద స్విమ్మింగ్ పూల్‌.. ఎక్క‌డుందంటే

హాయిగా నీటిలో ఈత కొడుతుంటే వ‌చ్చే థ్రిల్ అంతా ఇంతా కాదు.చ‌ల్ల‌గాలికి అలా స్విమ్మింగ్ ఫూల్ లోకి దిగి అన్నీ మ‌ర్చిపోయి స్విమ్ చేస్తుంటే చెప్ప‌లేనంత మ‌జా వ‌స్తుంది.

పైగా ఆరోగ్యానికి కూడా చాలామంచిది ఈ స్విమ్‌.అందుకే పెద్ద ధ‌న‌వంతుల ఇండ్ల‌లో క‌చ్చితంగా స్విమ్మింగ్ ఫూల్‌ను ఏర్పాటు చేసుకుంటారు.

ఎందుకంటే స్విమ్మింగ్ ఫూల్‌లో ఎంజాయ్ చేస్తే మైండ్ టెన్ష‌న్లు మొత్తం త‌గ్గిపోతాయి.స్ట్రెస్ మొత్తం పోయి హాయిగా అనిపిస్తుంది.

అందుకే స్టార్ యాక్ట‌ర్లు నిత్యం స్విమ్మింగ్ ఫూల్ లో ఎంజాయ్ చేసేందుకు రిసార్టుల‌కు వెళ్తుంటారు.

అయితే మారుతున్న కాలానికి త‌గ్గ‌ట్టు కొన్ని ప్ర‌త్యేక‌త‌లు కూడా ప్ర‌పంచ వ్యాప్తంగా ఉంటున్నాయి.

ప్ర‌తి విష‌యంలో ఇలా చేస్తున్నాయి కొన్ని కంపెనీలు.అయితే స్విమ్మింగ్ ఫూల్ విష‌యంలో కూడా ఇలాంటి టెక్నిక్‌ను వాడేసింది.

శాంటియాగోలోని ఓ పెద్ద హోట‌ల్‌.విశేషం ఏంటి అనుకుంటున్నారా.

చీలి దేశ రాజ‌ధాని అయిన శాంటియాగోలో ఈ పెద్ద హోట‌ల్ ఉంది.స‌ముద్రం ఒడ్డున ఉండే ఈ హోట‌ల్ క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు పెద్ద ప్లాన్ వేసింది.

అదేంటంటే ప్ర‌పంచంలోనే అతిపెద్ద స్విమ్మింగ్ పూల్‌ను ఇక్క‌డ నిర్మించింది. """/" / పెద్ద‌గా అంటే అంతా ఇంతా కాదండోయ్‌.

ఏకంగా కిలోమీటరు పొడవు దాకా ఉంది.ఏకంగా దీన్ని 19 ఎకరాల్లో క‌ట్టారు.

దీన్ని 250 మిలియన్ లీటర్ల నీటితో నింపేశారు.దీన్ని ఈత కొట్టాలంటే ఎవ‌రితోనూ సాధ్యం కాదు.

ఓ ప‌డ‌వ ఏసుకుంటే గానీ ఇటు నుంచి అటు దాట‌లేము.ఓ చిన్న చెరువులాగే ఉంటుంద‌నుకోండి.

దీన్ని నిర్మించేందుకు రూ.23 కోట్లు ఖ‌ర్చ‌య్యాయంట‌.

దీన్ని నింపేందుకు నిత్యం పసిఫిక్ మహాసముద్రం నుంచి నీటిని త‌ర‌లిస్తారంట‌.అయితే ఇందులో కేవ‌లం ఫిల్టర్ చేసిన నీటిని మాత్ర‌మే ఉంచుతార‌ని తెలుస్తోంది.

దీనికి సంబంధించిన వార్త ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది.

సాయంత్రం హైదరాబాద్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా