రాష్ట్రాన్ని నాశనం చేసింది టీడీపీనే..: మంత్రి ధర్మాన

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ధర్మాన ప్రసాదరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.తనకు ముఖ్యమంత్రిగా మరోసారి అవకాశం ఇవ్వాలని చంద్రబాబు అంటున్నారని తెలిపారు.

అయితే అవకాశం ఇచ్చినప్పుడు చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు.వైసీపీ అధికారంలో తాము ఎటువంటి అవినీతి లేకుండా పరిపాలన అందిస్తున్నామని పేర్కొన్నారు.

రూ.4 వేల కోట్లతో మూలపేట పోర్టు పనులు చేస్తున్నామని వెల్లడించారు.

రూ.800 కోట్లతో ఉద్దానం ప్రాంతానికి తాగునీరు అందిస్తున్నామన్నారు.

అంతేకాకుండా పలాసలో రూ.200 కోట్లతో కిడ్నీ రీసెర్చ్ ఆస్పత్రి ఏర్పాటు చేశామని చెప్పారు.

రాష్ట్రాన్ని నాశనం చేసింది టీడీపీనేనని విమర్శించారు.ఈ విషయం ప్రజలందరికీ తెలుసన్న ఆయన మళ్లీ వైసీపీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Lorem Ipsum Dolor Sit Amet