కొత్త హీరోలకు సాధ్యం కానీ ఆ ఒక్కటి స్టార్ హీరోల వల్ల మాత్రమే అవుతుంది… ఎందుకు..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరు చెబితే చాలా మందికి నందమూరి, మెగా, అక్కినేని, ఘట్టమనేని ఫ్యామిలీలు గుర్తుకొస్తూ ఉంటాయి.

ఎందుకంటే ఈ ఫ్యామిలీలకు చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీతో చాలా మంచి అనుబంధమైతే ఉంది.

మరి ఈ ఇండస్ట్రీలో ఉన్న హీరోల్లో చాలామంది ఈ ఫ్యామిలీలకి చెందిన హీరోలే ఉండడం విశేషం.

ఇక మొత్తానికైతే వీళ్ళ నుంచి వచ్చే సినిమాలు ప్రేక్షకులను ఎక్కువగా అలరిస్తాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఇక ఇప్పుడిప్పుడే కొంతమంది కొత్త హీరోలు( New Heroes ) ఇండస్ట్రీకి వచ్చి వాళ్ల సత్తాను చాటుతున్నారు.

అయినప్పటికీ భారీ సినిమాలు చేయాలంటే మాత్రం అది వారసత్వం ఉన్న హీరోల వల్లే అవుతుందంటూ గత కొన్ని రోజుల నుంచి కొన్ని కామెంట్లు అయితే వెలువడుతున్నాయి.

ఇక బడా ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతి హీరో కి సొంతంగా ప్రొడక్షన్ హౌజ్( Production House ) ఉండడమే కాకుండా వాళ్లకు నచ్చిన సినిమాలను వాళ్ళ బ్యానర్ లోనే తీసుకొని భారీ సక్సెస్ లను అందుకుంటున్నారు.

"""/" / ఇక కొత్తగా వచ్చే హీరోలకు ఇలాంటి ఫ్లెక్సిబిలిటీ లేదు.కాబట్టి వాళ్ల దగ్గరికి వచ్చే డైరెక్టర్లతో చిన్న చిన్న కథలను ఎంచుకొని సినిమాలు గా చేస్తున్నారు.

ఇక మొత్తానికైతే ఇండస్ట్రీలో స్టార్ హీరోల డామినేషన్ అయితే ఎక్కువగా ఉందనే చెప్పాలి.

మరి చిన్న హీరోలు ఈ రోజుల్లో స్టార్ హీరోగా( Star Hero ) గుర్తింపు పొందే అవకాశాలు ఉన్నాయా అంటే అది కష్టమనే చెప్పాలి.

ఒక హీరోకి వరుసగా సక్సెస్ లు వచ్చినప్పుడు ఆయన స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతాడు.

"""/" / కానీ ఇప్పుడున్న యంగ్ హీరోలకి( Young Heroes ) ఒక సినిమా హిట్ వస్తే తర్వాత వరుస ప్లాప్ లు వస్తున్నాయి.

కాబట్టి వాళ్ళు మీడియం రేంజ్ హీరోలు గానే కొనసాగుతున్నారు.అదే స్టార్ హీరోల వారసులైతే ఒక సినిమా సక్సెస్ రాగానే మరొక సినిమా వాళ్ల బ్యానర్ లోనే వాళ్లకు నచ్చిన డైరెక్టర్ కి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చి మరీ సినిమాలు చేయిస్తున్నారు.

దీనివల్ల వాళ్లకు చాలా వరకు ప్లస్ అవుతుంది.

ప్రభాస్ బన్నీ తర్వాత ఆ స్థాయి ఎవరిది.. ఈ ప్రశ్నలకు జవాబు దొరుకుతుందా?