ప్రజాస్వామ్యాన్ని జోక్ చేయడం వైసీపీకి తగదు..: నారా బ్రాహ్మణి

టీడీపీ నేత నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రజాస్వామ్యాన్ని జోక్ చేయడం వైసీపీకి తగదని చెప్పారు.వైసీపీ పాలనలో అసమర్థులు మాత్రమే కాదు నిజాన్ని కూడా చూడలేని కపోదులని విమర్శించారు.

స్కిల్ డెవలప్ మెంట్ కేసు నిరాధారమని, సీమెన్స్ మాజీ ఎండీ అన్ని అనుమానాలను నివృత్తి చేశారని నారా బ్రాహ్మణి తెలిపారు.

దీన్నే బట్టే చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారనే విషయం అర్థం అవుతుందని ఆమె వెల్లడించారు.

మాజీ ఎండీ స్కిమ్ గురించి తెలియజేసిన వైసీపీ నేతలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.