మోక్షజ్ఞ మొదటి సినిమా డైరెక్టర్ ఎవరో తెలిసిపోయింది…బాలయ్య ప్లానింగ్ సూపర్…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం వారసుల హవా కొనసాగుతుంది.ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలందరూ వారసత్వ బ్యాగ్రౌండ్ తో వచ్చిన వాళ్లే కావడం విశేషం.

ఇక మిగిలిన హీరోలందరూ కూడా సినిమాలు చేస్తున్నప్పటికీ వాళ్ళు మీడియం రేంజ్ హీరోలు గానే ఉంటున్నారు.

బ్యాక్గ్రౌండ్ తో వచ్చిన వాళ్ళు మాత్రమే ఇండస్ట్రీ లో స్టార్ హీరోలుగా ఎదుగుతున్నారు.

ఇక ఇలాంటి క్రమంలోనే నందమూరి బాలకృష్ణ కొడుకు అయిన మోక్షజ్ఞ కూడా ఇప్పుడు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి సినిమాలు చేయాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

"""/" / 2025 లో ఎలాగైనా సరే మోక్షజ్ఞ ( Mokshagna)ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా బాలయ్య బాబు ఇప్పటికే స్పష్టం చేశాడు.

ఇక దానికి సంబంధించిన మేకోవర్లోనే మోక్షజ్ఞ కూడా బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన మోక్షజ్ఞ ఫోటో చూస్తే అచ్చం హీరోలా ఉన్నాడని చాలామంది కామెంట్లు అయితే చేస్తున్నారు.

మరి మొత్తానికైతే ఆయన సినిమా ఎప్పుడు చేస్తాడు.ఎప్పుడు ఆ సినిమా రిలీజ్ అవుతుంది అని దాని కోసమే నందమూరి అభిమానులు వేయి కన్నులతో ఎదురుచూస్తున్నారు.

ఇక ఇలాంటి సందర్భంలో బాలయ్య బాబు మోక్షజ్ఞ ఎంట్రీ కి ఏ దర్శకుడు తో సినిమా చేయిస్తున్నాడనే వార్తలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

"""/" / ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మోక్షజ్ఞ సినిమాను చేయడానికి మరొక డైరెక్టర్ కూడా ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఆయన ఎవరు అంటే క్రిష్( Director Krish ).ఇంతకుముందు క్రిష్ బాలకృష్ణతో గౌతమీపుత్ర శాతకర్ణి( Gautamiputra Satakarni ) తోపాటు కథానాయకుడు, మహానాయకుడు అనే సినిమాలను కూడా చేశాడు.

కాబట్టి బాలకృష్ణకు క్రిష్ కి మధ్య మంచి సన్నిహిత్యమైతే ఉంది.మొదటి సినిమాని క్రిష్ డైరెక్షన్ లో చేస్తే మంచి గుర్తింపు వస్తుందని బాలయ్య బాబు అనుకుంటున్నాడట.

మరి క్రిష్ డైరెక్షన్ లో మోక్షజ్ఞ సినిమా ఉంటుందా లేదా వేరే డైరెక్టర్ల తో మోక్షజ్ఞ ఇంట్రడ్యూస్ అవుతాడా అనేది తెలియాల్సి ఉంది.

ఖలిస్తానీల వల్ల కెనడా కలుషితం అవుతోంది : భారత సంతతి ఎంపీ సంచలన వ్యాఖ్యలు