బీజేపీ ని నమ్ముకుంటే ఇబ్బందేనా ?

2024 లో జరగబోయే ఏపీ ఎన్నికలు రసవత్తరంగా ఉండేలా కనిపిస్తున్నాయి.ప్రస్తుత అధికార పార్టీ వైసీపీ ని రాబోయే ఎన్నికల్లో దీటుగా ఎదుర్కొని అధికారంలోకి రావాలని టిడిపి జనసేన బీజేపీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

విడివిడిగా జగన్ ను ఎదుర్కోవడం కష్టం అవుతుంది అని,  పొత్తు పెట్టుకుంటేనే అధికారంలోకి వస్తామని ఈ మూడు పార్టీలు భావిస్తున్నాయి.

ఇప్పటికే జనసేన బీజేపీ పార్టీలు పొత్తు కొనసాగిస్తుండగా,  టిడిపి కూడా వారితో జత కలిసేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది.

టిడిపిని తమతో కలుపుకుని వెళ్లేందుకు బిజెపి ఏమాత్రం ఇష్టపడలేదు.ఇక పవన్ విషయానికొస్తే బిజెపితో ఎన్నికలకు వెళ్లే కంటే , టిడిపితో కలిసి వెళ్తే నే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయని నమ్ముతున్నారు.

కానీ బీజేపీ మాత్రం జనసేన తమ నుండి దూరం కాకుండా చూసుకుంటోంది.గతంలో తమ రెండు పార్టీల ఉమ్మడి  అభ్యర్థిగా పవన్ పేరుని ప్రకటించినా, ఇప్పుడు మొత్తం బిజెపి ఆ విషయంలో సైలెంట్ గా ఉంది.

టిడిపి, జనసేన , బిజెపి పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీచేసినా, ఈ మూడు పార్టీల ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్ పేరును ప్రకటిస్తేనే తప్ప మిగతా ఏ ఆప్షన్ ను  ఒప్పుకునే పరిస్థితుల్లో జనసైనికులు లేరు.

ఈ విషయంలో వారు పవన్ పైన ఒత్తిడి పెంచుతున్నారు.ఇదిలా ఉంటే ఏపీలో బీజేపీ బలం అంతంతమాత్రమే.

  """/"/ క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం కూడా బిజెపికి లేదు .సొంతంగా పోటీ చేస్తే ఏపీ లో ఒక్క స్థానాన్ని దక్కించుకునే పరిస్థితుల్లో బిజెపి లేదు.

అటువంటి పార్టీతో జనసేన పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసినా,  ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది అనేది విశ్లేషకుల అభిప్రాయం.

బిజెపి స్థానంలో టీడీపీ తో జనసేన పొత్తు పెట్టుకుంటే ఖచ్చితంగా జనసేనకు మేలే జరుగుతుందని , అధికారంలోకి రావడం సాధ్యమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పవన్ లో కూడా దాదాపు ఇదే అభిప్రాయం ఉందట.బీజేపీతో కొన్నికొన్ని వ్యవహారాలు ముడిపడి ఉన్న కారణంగా పొత్తు రద్దు చేసుకునే సాహసం పవన్ కల్యాణ్ చేయలేకపోతున్నారట.

గ్లోబర్ స్టార్ తో కమిడియన్ చేసిన అల్లరి అంత ఇంత కాదుగా.. వీడియో వైరల్